
Mahesh Babu : సూపర్ స్టార్ సినీ ప్రస్థానానికి 42 ఏళ్ళు.. వైరల్ అవుతున్న మహేష్ కామన్ డీపీ..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈపేరుకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసిన సినిమా 30 లోపే అయిన అంతులేని అభిమానులను సంపాదించుకున్నారు.ఇక నటుడిగా చిన్నతనంలోనే కేరీర్ ను ప్రారంభించిన మహేష్ ఇప్పుడు స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. సినీ ప్రస్థానాన్ని బాలనటుడిగా ప్రారంభించిన మహేష్ ఇండస్ట్రీలోకి వచ్చి 42ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు హంగామా చేస్తున్నారు. తమ అభిమాన హీరో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 1979లో బాలనటుడిగా కెరీర్ ని ప్రారంభించిన మహేష్ 42 సంవత్సరాలుగా సినీ రంగంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు కామన్ డీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 42ఏళ్ల గోల్డెన్ ఎరా ఆఫ్ సూపర్ స్టార్ పేరుతో మహేష్ పోస్టర్ ను అభిమానులు వైరల్ చేస్తున్నారు. మహేష్ బాబు సతీమణి నమృత ఈ కామన్ డీపీని షేర్ చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా సమ్మర్ లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అలాగే ఈ సినిమాతర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అలాగే దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నారు సూపర్ స్టార్.
మరిన్ని ఇక్కడ చదవండి :
Samantha: చిరిగిన షర్ట్‌కు పిన్నులు పెట్టుకోవడం కూడా ఫ్యాషనేనా.? వైరల్‌గా మారిన సమంత లేటెస్ట్ ఫోటో..
Rashmika: అందాల రష్మిక మోటివేషనల్ పోస్ట్.. భయాన్ని ఎలా జయించాలో ఎంత బాగా చెప్పిందే చూడండి..
Shivani Rajashekar: చీరకట్టులో ‘అద్భుతం’గా అందాల తార.. శివాని రాజశేఖర్ లేటెస్ట్ ఫోటోలు చూశారా.?
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3xvmHl8
0 Response to "Mahesh Babu : సూపర్ స్టార్ సినీ ప్రస్థానానికి 42 ఏళ్ళు.. వైరల్ అవుతున్న మహేష్ కామన్ డీపీ.."
Post a Comment