
President Security: రాష్ట్రపతి సెక్యూరిటీ సిబ్బందిలో కరోనా కలకలం.. 19మందికి పాజిటివ్!

President Security Coronavirus: దేశంలో థర్డ్ వేవ్ టెన్షన్ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఓ VVIP సెక్యూరిటీ వింగ్‌లోని 19 మందికి కరోనా సోకింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. భారత్‌లో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుందనే హెచ్చరికలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. అయితే, ఇటీవల కేసులు కాస్త తగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, తాజాగా ఒకేసారి 19 మంది పోలీసులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సెక్యూరిటీలోని సిబ్బందికి రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవలే ఉత్తరాఖండ్రుషికేశ్లోని పరమార్థ నికేతన్ వద్ద ‘గంగా హారతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్. ఈ కార్యక్రమంలో భద్రతా విధులు నిర్వర్తించేందుకు వచ్చినవారిలో 19 మంది అధికారులు, సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడం కలకలం సృష్టించింది. ముందుజాగ్రత్త చర్యగా, అందరూ అధికారులను ప్రస్తుతం వారివారి సొంత జిల్లాల్లో ఐసొలేషన్‌లో ఉంచారు. రిషికేశ్‌లోని పరమార్థ్ నికేతన్ ఆశ్రమంలో విధులు నిర్వహిస్తున్న 7 మంది పోలీసులకు పౌరి ఆరోగ్య శాఖ లక్ష్మణ్ ఝూలా పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన పరీక్షల్లో వైరస్ సోకినట్లు తేలింది. వీరిలో ముగ్గురు చమోలి జిల్లా నుంచి, ఇద్దరు రిషికేశ్ నుంచి, ఒకరు రుద్రప్రయాగ్ నుంచి, ఒకరు దేవప్రయాగ్ నుంచి భద్రతా విధుల్లో ఉన్నారు.19 మంది బాధితుల్లో 14 మంది పోలీసు సిబ్బంది కాగా, మిగతా ఐదుగురు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, అధికారులున్నారు. విధుల్లో పాల్గొనడం కంటే ముందే వారిని ముందుజాగ్రత్త చర్యగా క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు చెప్పారు.
వీరితో సన్నిహతంగా ఉన్న మిగతా అధికారుల వివరాలను సేకరించామని, వారిని ఐసోలేషన్ఉండాలని ఆదేశించినట్లు చెప్పారు ఉన్నతాధికారులు. చమోలీ, ఉత్తరకాశీ, రుద్రప్రయోగ్, దెహ్రాదూన్, తెహ్రీ, పౌడీ నుంచి 400 మంది పోలీసులు, వివిధ శాఖల సిబ్బందికి పరమార్థ నికేతన్ ఆశ్రమం వద్ద పరీక్షలు నిర్వహించారు. వారిలో కొంతమందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరందరినీ భద్రతా విధుల నుంచి తాత్కాలికంగా తప్పించినట్లు స్పష్టం చేశారు అధికారులు. అయితే, అది పూజా కార్యక్రమం కావడంతో, ఇంకా ఎంత మందికి వైరస్ సోకి ఉంటుందనే ఆందోళన నెలకొంది. అందులోనూ రాష్ట్రపతి పాల్గొనడంతో టెన్షన్ మరింత పెరిగింది.
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/31hvjjo
0 Response to "President Security: రాష్ట్రపతి సెక్యూరిటీ సిబ్బందిలో కరోనా కలకలం.. 19మందికి పాజిటివ్!"
Post a Comment