-->
Charanjit Singh Channi: చిన్నారులతో కలిసి సీఎం ఎంజాయ్.. హెలికాప్టర్‌లో తిప్పిన సీఎం చన్నీ.. వీడియో

Charanjit Singh Channi: చిన్నారులతో కలిసి సీఎం ఎంజాయ్.. హెలికాప్టర్‌లో తిప్పిన సీఎం చన్నీ.. వీడియో

Charanjit Singh Channi

Chopper Ride: పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కొంతమంది చిన్నారులను తన హెలికాప్టర్‌లో ఎక్కించుకుని సరదాగా తిప్పుతూ ఎనలేని ఆనందాన్ని కల్పించారు. దీంతో చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి చన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తొలిసారిగా హెలికాప్టర్ ఎక్కడం.. అందులోనూ స్వయంగా సీఎంతో ప్రయాణించడంతో పిల్లలు హుషారుగా కనిపించారు. దీనిపై సీఎం చన్నీ సైతం ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలతో ఛాపర్ రైడ్‌ సంతోషంగా ఉందని.. అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం ద్వారా వారికి ఉజ్వల, సుసంపన్నమైన భవిష్యత్తును అందించడమే తమ ప్రయత్నమంటూ చరణ్‌జిత్ సింగ్ చన్నీ వీడియో పోస్ట్ చేస్తూ ట్వీట్టర్లో రాశారు. కాగా.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

హెలికాప్టర్‌ ఎక్కిన చిన్నారులను మీడియా ప్రతినిధులు వారితో మాట్లాడగా.. ఆనందంతో గెంతులేశారు. మొదటిసారి హెలికాప్టర్‌ ఎక్కామని.. అది కూడా ముఖ్యమంత్రితో ప్రయాణించడం ఆనందంగా ఉందని తెలిపారు. కాగా.. ఈ ఏడాది సెప్టెంబరులో కెప్టెన్ అమరీందర్‌ సింగ్ రాజీనామా చేయడంతో చరణ్‌జిత్ సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

వీడియో..

Also Read:

Corona – Omicron: ఒమిక్రాన్ విషయంలో ఊరట కలిగించే న్యూస్ చెప్పింది సౌతాఫ్రికా.. అదేంటంటే..

Omicron Alert: ఆ దేశాల నుంచి వచ్చేవారు కచ్చితంగా ఈ రూల్స్ పాటించాల్సిందే.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3xA4Rxp

0 Response to "Charanjit Singh Channi: చిన్నారులతో కలిసి సీఎం ఎంజాయ్.. హెలికాప్టర్‌లో తిప్పిన సీఎం చన్నీ.. వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel