
LB Nagar junction: వాహనదారులూ బీ అలర్ట్.. హైదరాబాద్ ఎల్బీ నగర్ జంక్షన్ నెల రోజుల పాటు మూసివేత.. పూర్తి వివరాలివే..

LB Nagar junction: రాష్ట్ర ప్రభుత్వం తన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డిపి)లో భాగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నందున హైదరాబాద్‌లోని ఎల్‌బి నగర్ జంక్షన్ వద్ద ఉన్న ఆర్టీరియల్ రోడ్డును ఒక నెల రోజుల పాటు మూసివేస్తున్నారు. ఈ మేరకు హైరదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD) శాఖ SRDPలో భాగంగా 20 ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు ఇచ్చిందని, వీటిలో ఒక ప్రాజెక్ట్ LB నగర్‌లో జరుగుతోందని తెలిపింది. హైదరాబాద్ – విజయవాడ హైవేలో ఈ జంక్షన్ ఎంతో కీలకమైనది. అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో ఒకటి కూడా.
ఎల్‌బీ నగర్ జంక్షన్ వద్ద పనులు శరవేగంగా జరుగుతున్నాయని, జనవరి 31, 2022 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సదరు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ‘‘ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం లోతైన తవ్వకాలు జరపాల్సి ఉంది. సికింద్రాబాద్ వైపు, సర్వీస్ రోడ్డు వెడల్పు చాలా తక్కువగా ఉంది. ఫలితంగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఈ మార్గం ద్వారా ప్రయాణించడం చాలా ప్రమాదకరం. అందుకనే ఎల్‌బి నగర్ వెహికల్ అండర్‌పాస్ పక్కన ఉన్న సర్వీస్ రహదారిని ఒక నెల పాటు పూర్తిగా మూసివేయాలని నిర్ణయించడం జరిగింది. విజయవాడ వైపు వెళ్లాల్సిన ఫ్రీ లెఫ్ట్ ట్రాఫిక్ ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి.’’ అని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు.
అల్కాపురి జంక్షన్ నుంచి వచ్చే ట్రాఫిక్ కామినేని ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డుపైకి వచ్చి కుడివైపు సర్వీస్ రోడ్డు మీదుగా విజయవాడ వైపు వెళ్లాలని లేదా ఎల్‌బీ నగర్ ఎల్‌హెచ్‌ఎస్ (ఎడమవైపు) వెహికల్ అండర్‌పాస్ మీదుగా బైరమల్‌గూడ జంక్షన్ మీదుగా వెళ్లాలని అధికారులు తెలిపారు. విజయవాడ రహదారికి చేరుకోవడానికి చింతలకుంట రహదారి అండర్‌పాస్ వైపు ఎడమవైపునకు వెళ్లాలని సూచించారు. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు నగరంలోని 20 జంక్షన్లలో మల్టీ ఫ్లై ఓవర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే శరవేగంగా ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నారు.
Also read:
Balakrishna: బాలకృష్ణ-గోపిచంద్ మలినేని సినిమా పై సరికొత్త గాసిప్.. అదెంటంటే..
Digilocker: మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. అన్ని డాక్యుమెంట్లు భద్రంగా దాచుకోవచ్చు..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3FwhUT1
0 Response to "LB Nagar junction: వాహనదారులూ బీ అలర్ట్.. హైదరాబాద్ ఎల్బీ నగర్ జంక్షన్ నెల రోజుల పాటు మూసివేత.. పూర్తి వివరాలివే.."
Post a Comment