
AP – TS Wine Shops: మద్యం షాపుల కోసం ఏపీ-తెలంగాణ వ్యాపారుల కొట్లాట..!

Andhra pradesh – Telangana Wines: నీటి వాటా కోసం రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడడం చూసా.. కానీ మద్యం షాపులు దక్కించుకునేందుకు రెండు రాష్ట్రాల వ్యాపారులు ఇప్పుడు పోటీ పడడం ఆశ్చర్యాన్నికలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మద్యం షాపుల కోసం టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ సరిహద్దులో రెండే రెండు మద్యం షాపులున్నాయి. వాటి కోసం భారీ సంఖ్యలో పక్క రాష్ట్రం నుంచి వచ్చి టెండర్లు వేస్తున్నారంటే ఆ షాపులకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
వివరాల్లోకెళితే.. జోగులంబా గద్వాల జిల్లా తెలంగాణ సరిహద్దు అయిన ఆలంపూర్ చౌరాస్తాలో రెండు మద్యం షాపులకు అనుమతించింది ఎక్సైజ్ శాఖ. ఇక్కడ నుంచి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు కేవలం 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో ప్రతి రోజు పెద్ద సంఖ్యలో మందుబాబులు ఇక్కడికి వస్తుంటారు. రోజుకు ఒక్కొక్క షాప్ ఇరవై లక్షల రూపాయల మద్యాన్ని విక్రయిస్తుంది. ప్రతిరోజు భారీ కలెక్షన్ ఉండడంతో మద్యం వ్యాపారులు వీటిని దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో లైసెన్స్ కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు మద్యం వ్యాపారులు.
జోగులంబా గద్వాల జిల్లాలో మద్యం షాపుల టెండర్ల కోసం వచ్చే వ్యాపారులతో ఎక్సైజ్ ఆఫీస్ కిక్కిరిసిపోతోంది. ఈ రెండు షాపుల కోసం ఆంధ్ర, తెలంగాణా వ్యాపారుల మధ్య భారీ పోటి ఏర్పడింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వైన్ షాపుల కోసం మొత్తం ఐదు వందల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 350 దరఖాస్తులు అలంపూర్ చౌరస్తాలోని రెండు షాపుల కోసమే వేశారంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వైన్స్ షాపులను దక్కించుకునేందుకు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. టెండర్లు దక్కించుకున్న వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నెల 20 వ తేదీన డిప్ ద్వారా షాపులను కేటాయిస్తామని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ సైదులు చెబుతున్నారు.
Also read:
Balakrishna: బాలకృష్ణ-గోపిచంద్ మలినేని సినిమా పై సరికొత్త గాసిప్.. అదెంటంటే..
Digilocker: మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. అన్ని డాక్యుమెంట్లు భద్రంగా దాచుకోవచ్చు..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/32fDYDi
0 Response to "AP – TS Wine Shops: మద్యం షాపుల కోసం ఏపీ-తెలంగాణ వ్యాపారుల కొట్లాట..!"
Post a Comment