-->
IND vs SCO T20 World Cup 2021 Match Prediction: మరోసారి టెన్షన్ పెట్టేందుకు స్కాట్లాండ్ సిద్ధం.. భారీ తేడాతో భారత్ గెలవగలదా?

IND vs SCO T20 World Cup 2021 Match Prediction: మరోసారి టెన్షన్ పెట్టేందుకు స్కాట్లాండ్ సిద్ధం.. భారీ తేడాతో భారత్ గెలవగలదా?

T20 World Cup 2021, Ind Vs Sco (1) (1)

IND vs SCO T20 World Cup 2021 Match Prediction: టీ20 ప్రపంచ కప్‌ సూపర్ 12లో భాగంగా నేడు భారత్ వర్సెస్ స్కాంట్లాండ్ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచులో స్కాంట్లాండ్ టీం న్యూజిలాండ్‌ను చివరి దాకా కంగారు పెట్టింది. భారీ స్కోర్ చేసినా కివీస్ టీం చివరి దాకా టెన్షన్ పడుతూనే ఉంది. దీంతో ఈ మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగనుందనడంలో సందేహం లేదు. 2007లో తర్వాత T20Iలో ఇరు జట్లు ఎప్పుడూ కలుసుకోలేదు. ఆఫ్ఘనిస్తాన్ సవాలును నేర్పుగా ఎదుర్కొన్న భారత్, అలాంటి ప్రదర్శనను మరో రెండుసార్లు పునరావృతం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆఫ్ఘనిస్తాన్ మ్యాచులో భారత్ అన్ని రంగాల్లో రాణించింది. అలాగే ఓపెనర్లు కూడా తమ ఫాంలో కనిపించారు. బౌలింగ్‌లో ముఖ్యంగా అశ్విన్ రావడం కోహ్లీసేనకు కలిసొచ్చింది.

స్కాట్‌లాండ్‌కు భారతదేశం విసిరే సవాలు గురించి తెలుసు. సూపర్ 12 దశలో ఇప్పటివరకు మూడు పరాజయాలు ఉన్నప్పటికీ, స్కాట్లాండ్ టీం తమ మునుపటి మ్యాచులో న్యూజిలాండ్‌ను కలవరపెట్టగలరని చూపించారు. పవర్‌ప్లేలో స్కాట్లాండ్ టీం పేసర్‌లపై ఎక్కువగా ఆధారపడుతోంది.

ఎప్పుడు: భారతదేశం vs స్కాట్లాండ్(IND vs SCO), శుక్రవారం, నవంబర్ 5, రాత్రి 07:30 గంటలకు

ఎక్కడ: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం

పిచ్, పరిస్థితులు: టాస్ మరోసారి కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది. దుబాయ్ ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో స్కాట్లాండ్ టీం అదరగొట్టింది.

ఇండియా
గాయాలు/అందుబాటులో లేని ఆటగాళ్లు: హార్దిక్ పాండ్యా మోచేతి గాయం కొద్దిగా ఆందోళన కలిగించే అంశమే. అయితే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచులో రెండు ఓవర్లు కూడా బౌలింగ్ చేశాడు.

భారత ప్లేయింగ్ XI అంచనా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

స్కాట్లాండ్
గాయం/అందుబాటులో లేని ఆటగాళ్లు: స్కాట్లాండ్ సారథి కైల్ జోష్ డేవీ అందుబాటులో ఉంటాడా లేదా అనేది 100 శాతం కచ్చితంగా తెలియదు. అతను అందుబాటులో లేకుంటే, స్కాట్లాండ్ టీం న్యూజిలాండ్‌తో ఆడిన ప్లేయింగ్ XIతో ఆడొచ్చు.

స్కాట్లాండ్ ప్లేయింగ్ XI అంచనా: జార్జ్ మున్సే, కైల్ కోయెట్జర్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్ (కీపర్), రిచీ బెరింగ్టన్, కాలమ్ మాక్లియోడ్, మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, సఫ్యాన్ షరీఫ్, అలస్డైర్ ఎవాన్స్, బ్రాడ్లీ వీల్

మీకు తెలుసా

– టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్‌ను అధిగమించేందుకు బుమ్రా రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు.

– కోహ్లి 2021లో ఎనిమిది T20Iలలో ఒకసారి మాత్రమే టాస్ గెలిచాడు. కోహ్లీ టాస్ ఓడిపోయిన ఏడు సార్లు భారత్‌ను మొదట బ్యాటింగ్ చేయమని అడిగారు.

Also Read: T20 World Cup 2021, IND vs SCO: వంద శాతం ప్రయత్నిస్తాం.. కోహ్లీసేనను ఓడిస్తాం: స్కాట్లాండ్ సారథి

Virat Kohli Dance Video: మైదానంలో కేక పుట్టించిన విరాట్ కోహ్లీ.. వైరలవుతోన్న వీడియో..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3bF4ibv

Related Posts

0 Response to "IND vs SCO T20 World Cup 2021 Match Prediction: మరోసారి టెన్షన్ పెట్టేందుకు స్కాట్లాండ్ సిద్ధం.. భారీ తేడాతో భారత్ గెలవగలదా?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel