
Kristen Stewart: సహనటితో నిశ్చితార్థం చేసుకున్న ట్విలైట్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ప్రకటన..

అమెరికాకు చెందిన ప్రముఖ హాలీవుడ్ నటి, ‘ద ట్విలైట్ సిరీస్’ ఫేమ్ క్రిస్టెన్ స్టెవార్ట్ షాకింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సహనటి డైలాన్ మేయర్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండేళ్ల నుంచి తాము డేటింగ్‌లో ఉన్నామని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామంటూ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. స్టెవార్ట్- డైలాన్ రిలేషన్ షిప్ గురించి గత కొన్నేళ్లుగా పలు పుకార్లు వస్తున్నాయి. వీరిద్దరూ ఇప్పటికే రహస్యంగా వివాహం చేసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే తమ రిలేషన్‌షిప్ గురించి ఈ ఇద్దరూ ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు. అయితే తాజాగా క్రిస్టెన్ చేసిన ప్రకటనతో వీరి బంధంపై అందరికీ స్పష్టత వచ్చింది.
ఒకరి కోసం ఒకరు..
ప్రపంచంలో సినిమాల ద్వారా అత్యధిక ఆదాయం ఆర్జిస్తోన్న నటీమణుల్లో స్టెవార్ట్ కూడా ఒకరు. 12 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ‘ప్యానిక్ రూమ్’, ‘స్పీక్’, ‘ఇన్ టు ద వైల్డ్’, ‘ద ట్విలైట్ సాగా సిరీస్’, ‘ఛార్లీస్ ఏంజెల్స్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘ద ట్విలైట్ సాగా సిరీస్’ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక డైలాన్ మేయర్ విషయానికొస్తే ఆమె కూడా ఒక నటి. ‘మోక్సీ, ‘రాక్ బాటమ్’, ‘మిస్ 2059’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మంచి రచయిత కూడా. ఈ సందర్భంగా తమ రిలేషన్‌షిప్‌పై స్టెవార్ట్ మాట్లాడుతూ ‘ నేను ఎంతో ఒత్తిడిని అనుభవించాను. అయితే ఈ ఒత్తిడి నేను LGBTQ కమ్యూనిటీకి చెందిన దాన్ని అని ఎప్పుడూ ఫీల్ అయ్యేలా చేయలేదు. నేనా నా గర్ల్‌ఫ్రెండ్(డైలాన్)ని కలవడానికి ప్రతిరోజుల బయటకు వెళుతుంటాను. తనతో దగ్గరగా ఉన్న సమయంలో మమ్మల్ని ఫొటో తీయడానికి చాలామంది ఎదురుచూస్తుంటారు. అతి త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. మేం ఒకరికోసం ఒకరం జీవించాలని కోరుకుంటున్నాం.
Also Read:
Varadharajan Gopal: సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఇంట విషాదం
Vijay Sethupathi: విజయ్ సేతుపతి పై దాడికి అసలు కారణం అదేనా..? ఆ హీరో అభిమానులే చేశారా..?
Stuartpuram Donga: గజ దొంగగా బెల్లంకొండ హీరో.. డిఫరెంట్ లుక్‌లో అదరగొట్టిన యంగ్ హీరో..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CPoXoX
0 Response to "Kristen Stewart: సహనటితో నిశ్చితార్థం చేసుకున్న ట్విలైట్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ప్రకటన.."
Post a Comment