-->
Eyebrows: వయసు పెరిగే కొద్ది కనుబొమ్మలపై ఈ తేడాలు గమనించారా..! అసలు నిజం తెలుసుకోండి..

Eyebrows: వయసు పెరిగే కొద్ది కనుబొమ్మలపై ఈ తేడాలు గమనించారా..! అసలు నిజం తెలుసుకోండి..

Old Age

Eyebrows: చాలా మందికి పెరుగుతున్న వయస్సుతో పాటు వారి కనుబొమ్మల వెంట్రుకలు కూడా పెరగడం ప్రారంభిస్తాయి. వాటివల్ల కళ్లు కూడా మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఆడవాళ్లతో అలా జరగదు. అయితే ఇది ఎందుకు జరుగుతుంది ఈ ప్రశ్న చాలా సంవత్సరాలుగా ప్రజలను వేధిస్తోంది. అమెరికా శాస్త్రవేత్తలు దీనికి సమాధానం చెప్పారు. వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో వెంట్రుకలు పెరుగుతాయని, మహిళల్లో తగ్గుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. దీనికి కారణం హార్మోన్ల ప్రభావం.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ సైన్సెస్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. పురుషులలో మందమైన కనుబొమ్మలకు అతిపెద్ద కారణం హార్మోన్ల స్థాయిలు పెరగడమే. వయసు పెరిగే కొద్దీ హార్మోన్లు హెయిర్ ఫోలికల్స్‌పై ప్రభావం చూపుతాయని చికాగో స్కిన్ క్లినిక్‌కి చెందిన చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ డెల్ కాంపో చెప్పారు. ఈస్ట్రోజెన్ హార్మోన్ జుట్టు పెరుగుదలను పెంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయసు పెరుగుతున్న పురుషులలో ఈస్ట్రోజెన్ హార్మోన్ పెరుగుతుంది. అయితే వృద్ధ మహిళల్లో మాత్రం రుతువిరతి తర్వాత ప్రారంభమవుతుంది.

జుట్టు రంగు, పొడవు
జుట్టు రంగు, పొడవు, ఆకృతి, దాని పెరుగుదలకు అనేక కారణాలు ఉంటాయని కాలిఫోర్నియాలోని చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ మేరీ జిన్ చెప్పారు. ఎందుకంటే హార్మోన్ల ప్రభావం పురుషులు, స్త్రీలలో వేర్వేరుగా ఉంటుంది. ఇది పరిశోధనలో కూడా రుజువైంది. ప్రతి వెంట్రుక కూడా హెయిర్ ఫోలికల్స్ నుంచి పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హెయిర్ ఫోలికల్స్ బలహీనపడటం వల్ల ఎప్పటికప్పుడు జుట్టు రాలిపోతుంది. శరీరంలోని వివిధ భాగాలలో హెయిర్ ఫోలికల్స్ బలహీనపడే సమయం భిన్నంగా ఉంటుంది. దీనికి ఉత్తమ ఉదాహరణ కనుబొమ్మలు. ఇక్కడి వెంట్రుకల కుదుళ్లు అత్యంత బలమైనవి. ఈ కారణంగానే చాలా మందిలో కనుబొమ్మల ఎదుగుదల ఎక్కువగా ఉండడం వల్ల వాటిని కత్తిరించాల్సి వస్తుంది.

మగవారి జుట్టు స్త్రీల కంటే వేగంగా పెరుగుతుంది..
చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ మేరీ జిన్ మాట్లాడుతూ.. “జుట్టు పెరుగుదల, ఊడిపోయే సమయం ఉంటుంది. దీనినే హెయిర్ సైకిల్ అంటారు. మానవులలో హార్మోన్ల స్థాయి వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఉదాహరణకు ఆండ్రోజెన్ హార్మోన్ స్థాయి పురుషులలో ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో తక్కువగా ఉంటుంది. ఈ హార్మోన్ జుట్టు పొడవును పెంచుతుంది. అందుకే పురుషుల జుట్టు మహిళల కంటే ఎక్కువగా పెరుగుతుంది”

Lunar Eclipse 2021: నవంబర్ 19న చివరి చంద్రగ్రహణం.. ఈ 2 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..

Komaki నుంచి వెనిస్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్‌ అదిరిపోతున్నాయ్‌.. ఇక Olaకి గట్టి పోటీ..

Kimjongun: కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించింది..! నెల రోజులుగా కనిపించడం లేదు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3c7kGBN

Related Posts

0 Response to "Eyebrows: వయసు పెరిగే కొద్ది కనుబొమ్మలపై ఈ తేడాలు గమనించారా..! అసలు నిజం తెలుసుకోండి.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel