-->
చైనీస్ అరటిపండు ఎప్పుడైనా తిన్నారా..! ఇది చాలా స్పెషల్.. ఎలా పండిస్తారో తెలుసా..?

చైనీస్ అరటిపండు ఎప్పుడైనా తిన్నారా..! ఇది చాలా స్పెషల్.. ఎలా పండిస్తారో తెలుసా..?

Banana Farming

Chinese Bananas: అరటిపండు ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్‌. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు ఉండే ఏకైక పండు. అందుకే దీనిని పేదవారి నుంచి పెద్దల వరకు అందరు తింటారు. పచ్చి అరటిపండ్లను కూరలలో కూడా వాడుతారు. అంతేకాదు దీన్ని ప్రాసెస్ చేయడం ద్వారా తయారు చేసిన అనేక ఇతర ఉత్పత్తులు ఈ రోజుల్లో మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే ఇందులో చైనీస్ అరటి అన్ని అరటి జాతులలో చాలా ప్రత్యేకమైనది. ఇది భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది.

ఈ కారణంగా ప్రజలు దీన్ని చాలా ఉత్సాహంగా తింటారు. పండుతో పాటు చైనీస్ అరటిని చిప్స్ ఉత్పత్తుల తయారీలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. బీహార్‌లోని వైశాలి, సమస్తిపూర్, ముజఫర్‌పూర్ జిల్లాల్లో చైనీస్ అరటిని పెద్ద ఎత్తున పండిస్తారు. చైనీస్ అరటి మొక్కలు ఇతర రకాల కంటే చాలా లేత, సన్నగా, తక్కువ ఎత్తులో పెరుగుతాయి. దీని అరటి గెలలు చాలా గట్టిగా ఉంటాయి. సాధారణంగా ఒక్కో గెల 15 కిలోల వరకు బరువు ఉంటుంది. ఒక్కో గెలకి దాదాపు 150 అరటిపళ్లు ఉంటాయి.

ఈ అరటిపండు ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది..
ఇతర రకాల కంటే ఈ అరటి చాలా తియ్యగా ఉంటుంది. పండిన పండ్లను గది ఉష్ణోగ్రత వద్ద 3-4 రోజులు నిల్వ ఉంచవచ్చు. చైనీస్ అరటి పంట చక్రం వ్యవధి 16 నుంచి 17 నెలలు. మీరు చైనా అరటి నుంచి ఒక హెక్టారు నుంచి 40 నుంచి 45 టన్నుల దిగుబడి సాధించవచ్చు. చైనీస్ అరటిపండు మృదువైన, తెలుపు, సుగంధ, పుల్లని-తీపి రుచి మిశ్రమం. పండిన అరటిపండ్లు నిల్వ సమయంలో వాసనను వెదజల్లుతూ ఉంటాయి. దాని సుగంధ నాణ్యత కారణంగా వీటి నుంచి అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తారు. ఇవి మార్కెట్లో గొప్ప గిరాకీని కలిగి ఉన్నాయి. దీని వల్ల రైతులు ప్రత్యక్ష ప్రయోజనం పొంది వారి ఆదాయం పెరుగుతుంది. బీహార్‌ జిల్లాలలో చైనీస్‌ అరటిని ఎక్కువగా పండిస్తారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా పండిస్తున్నారు.

Cold: జలుబు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయా..! అయితే ఈ 5 విషయాలు తెలుసుకోండి..

Skin Care: మెడపైన ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..! ఈ ఐదు మార్గాలను తెలుసుకోండి..

Viral Photos: ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప.. తినాలంటే అదృష్టం ఉండాలి..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ncie3f

0 Response to "చైనీస్ అరటిపండు ఎప్పుడైనా తిన్నారా..! ఇది చాలా స్పెషల్.. ఎలా పండిస్తారో తెలుసా..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel