
Earthquake: హర్యానాలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు..!

Earthquake: భూకంపాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత3.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూకం కేంద్రం ఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది. అయితే భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి భయాందోళనతో పరుగులు తీశారు. కాగా, గుజరాత్‌లో కూడా గురువారం తెల్లవారుజామున భూకంపం చోటు చేసుకుంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది.
భూకంపాలు ఎందుకు వస్తాయి?
భూమి యొక్క ఉపరితలం కింద, రాళ్ళు అకస్మాత్తుగా విరిగిపోవటం లేదా జారడం వలన, అక్కడ కదలికలు ఏర్పడతాయి. దీని కారణంగా సాధారణంగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ ప్రక్రియలో విడుదలయ్యే శక్తి కారణంగా భూకంప తరంగాలు వచ్చి భూమి కంపించడం ప్రారంభమవుతుంది. భూకంపం సంభవించినప్పుడు కొంత సమయం తర్వాత రాళ్ళు మరియు రాళ్ళు కదులుతాయి. అయితే రాయి విరగడం మొదలయ్యే ప్రదేశాన్ని భూకంపం యొక్క ఫోకస్ అంటారు. భూమిపై ఫోకస్‌కు కొంచెం పైన ఉన్న భాగాన్ని ఎపిసెంటర్ అంటారు.
An earthquake with a magnitude of 3.3 on the Richter Scale hit Jhajjar, Haryana today at 8:15 pm: National Centre for Seismology pic.twitter.com/xEXU7Mezk2
— ANI (@ANI) November 5, 2021
ఇవి కూడా చదవండి:
Gold Price Today: షాకిస్తున్న బంగారం ధరలు.. కొన్ని ప్రాంతాల్లో పెరిగితే.. మరి కొన్ని చోట్ల తగ్గింది.. ఎక్కడెక్కడ అంటే..
Sugar Price: అక్కడ పెట్రోల్ కంటే చక్కెర ధర రికార్డ్ స్థాయిలో.. కిలో పంచదార రూ.150
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CQBMQ5
0 Response to "Earthquake: హర్యానాలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు..!"
Post a Comment