-->
Crime News: ప్రేమ గుడ్డి వాడిని చేసింది.. పెళ్లి తిరస్కరించిన యువకుడిపై యాసిడ్‌ పోసిన వివాహిత!

Crime News: ప్రేమ గుడ్డి వాడిని చేసింది.. పెళ్లి తిరస్కరించిన యువకుడిపై యాసిడ్‌ పోసిన వివాహిత!

Woman Attacks Youth With Acid

Woman Attacks Youth with Acid: కేరళలో దారుణం జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానంటూ నిరాకరించిన యువకుడి ముఖంపై యాసిడ్‌ పోసిన మహిళను ఆదిమాలి పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరువనంతపురంలోని పూజపురకు చెందిన అరుణ్‌కుమార్ (27) అనే యువకుడిపై ఓ మహిళ యాసిడ్‌ పోసిన ఘటనలో అతడికి కంటి చూపు పోయింది. ఈ ఘటనకు సంబంధించి ఆదిమాలి పట్టణానికి చెందిన షీబా (35) అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. యాసిడ్ దాడికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ పోలీసులు విడుదల చేశారు. అయితే వీరిద్దరూ గత కొంతకాలంగా చనువు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నవంబర్ 16న ఇడుక్కి జిల్లా ఆదిమాలి సమీపంలోని ఇరుంపుపాలెం వద్ద సెయింట్ ఆంటోనీ చర్చి ముందు ఈ ఘటన జరిగింది. ఆదిమాలి పోలీసులు శనివారం సాయంత్రం ఆదిమాలిలోని వాలారా సమీపంలోని పడిక్కత్‌కు చెందిన షీబా (35)ను అరెస్టు చేశారు. అరుణ్‌పై షీబా వెనుక నుంచి యాసిడ్‌తో దాడి చేసినట్లు సీసీటీవీ విజువల్స్‌లో వెల్లడైంది. పరిస్థితిని గమనించిన తర్వాత, ఆమె సంఘటన స్థలం నుండి నెమ్మదిగా జారుకుంది. దాడి సమయంలో అతనితో పాటు ఉన్న అతని స్నేహితులు కూడా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆదిమాలిలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం వైద్య కళాశాలకు తరలించారు.

పోలీసులు నివేదికల ప్రకారం,తిరువనంతపురం జిల్లాలో షీబా హోమ్‌ నర్సుగా పనిచేస్తుండగా అరుణ్‌కుమార్‌తో సోషల్‌ మీడియాలో పరిచయం ఏర్పడింది. అదీ కాస్త ప్రేమకు దారితీసింది. షీబాకు పెయింటర్‌గా పనిచేస్తున్న సంతోష్‌తో పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత ఆ యువకుడు ఆ సంబంధం నుంచి తప్పుకున్నాడు. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ అరుణ్‌ను తరుచు కలుస్తూ ఉండేది. అనంతరం అతడిని బ్లాక్ మెయిల్ చేసి రూ.2 లక్షలు డిమాండ్ చేసింది.

అయితే, అరుణ్‌కుమార్‌ మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలియడంతో అతడిని ఆదిమలికి పిలిపించింది. ఈ విషయమై చర్చించేందుకు ఆదిమాలి రావాలని అరుణ్‌ని కోరింది. ఈ క్రమంలో అక్కడికి తన స్నేహితుడితో కలిసి వచ్చిన అరుణ్‌పై యాసిడ్‌‌తో దాడి చేసింది. అతడి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. షీబాను ఆమె భర్త ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. దాడిలో ఆమె చేతులపై యాసిడ్ పడడంతో ఆమె కూడా కాలిన గాయాలకు గురైంది. రబ్బరు గడ్డకట్టడానికి ఉపయోగించే యాసిడ్‌ను ఆమె తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు.

Read Also…  TDP Leader Arrest: అర్థరాత్రి హైడ్రామా.. టీడీపీ మరో ముఖ్య నేత అరెస్ట్.. ఎక్కడికి తీసుకెళ్లారంటే..?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3oKrzyF

Related Posts

0 Response to "Crime News: ప్రేమ గుడ్డి వాడిని చేసింది.. పెళ్లి తిరస్కరించిన యువకుడిపై యాసిడ్‌ పోసిన వివాహిత!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel