-->
Akhanda Movie : బాలయ్య ‘అఖండ’ సినిమాకు హైలైట్ ఆ 45 నిమిషాలేనట..

Akhanda Movie : బాలయ్య ‘అఖండ’ సినిమాకు హైలైట్ ఆ 45 నిమిషాలేనట..

Akhand

Akhanda :  నందమూరి బాలకృష్ణ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బోయపాటి బాలయ్య కాంబినేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సంధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ. బాలయ్యను మరోసారి పవర్ ఫుల్ పాత్రలో చూపించడానికి సిద్ధమయ్యారు బోయపాటి. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, దద్దరిల్లే డైలాగులను బాలయ్య అభిమానుల కోసం రెడీ చేశారు బోయపాటి. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక రీసెంట్ గా రిలీజ్ ఆయిన అఖండ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇక తాజా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బాలయ్య అభిమానులను ఖుషీ చేస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదిరిపోయే ఫైట్స్ ఉండనున్నాయట. మామూలుగానే బోయపాటి సినిమా అంటే ఫైట్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఇందులో 45 నిమిషాల నిడివితో యాక్షన్ ఘట్టాలు రక్తి కట్టిస్తాయని సమాచారం. అలాగే అఘోర గా బాలయ్య నటన నెక్స్ట్ లెవల్ లో ఉండనుందని అంటున్నారు. అఖండ సినిమాలో శ్రీకాంత్ – జగపతి పాత్రలు హైలైట్ గా నిలుస్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రగ్య జైశ్వాల్ అందచందాలు ప్రధాన అస్సెట్ కానున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hyderabad: ఇకపై థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిందే.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..

ఇండియాలో మొట్టమొదటి ‘లేడీ సూపర్ హీరో’ చిత్రం.. 3డిలో అదరగొట్టనున్న మాజీ మిస్‌ ఇండియా..

Varshini Sounderajan: తన ఒంపుసొంపులతో ఫిదా చేస్తున్న వర్షిణి లేటెస్ట్ పిక్స్

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3HEU1e6

0 Response to "Akhanda Movie : బాలయ్య ‘అఖండ’ సినిమాకు హైలైట్ ఆ 45 నిమిషాలేనట.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel