
BRAOU Admissions: అంబేడ్కర్ డిగ్రీ, పీజీ కోర్సుల అడ్మిషన్ల గడువు పెంపు.. ఆఖరు తేదీ ఎప్పుడంటే..

డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నవంబర్ 11 వరకు గడువును పొడిగించింది. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీలతో పాటు పీజీ, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో నవంబర్ 11 వరకు రూ.200 ఆలస్య రుసుంతో చెల్లించి ప్రవేశం పొందవచ్చునని వారు తెలిపారు. గత నెలలో ఈ గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థుల అభ్యర్థన మేరకు మరోసారి ఈ గడువును పొడిగించారు.
కోర్సుల్లో చేరేందుకు విద్యార్హతలు, ఫీజు వివరాలను తెలుసుకోవడానికి తమ అధికారిక వెబ్‌సైట్https://www.braouonline.in/ ను సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా 7382929570/580 నంబర్లతో పాటు యూనివర్సిటీ హెల్ప్‌లైన్ నంబర్లు 040- 23680290/291/294/295 ను కూడా సంప్రదించవచ్చునని వారు పేర్కొన్నారు.
Also Read:
APPSC Recruitment: హార్టికల్చర్‌లో డిగ్రీ చదివిన వారికి గుడ్‌న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాలు.. రేపే లాస్ట్‌డేట్.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
JNVST 2022: విద్యార్థులకు గమనిక..! నవోదయ స్కూల్స్‌లో ప్రవేశాలకు చివరితేదీ పొడగింపు..
Railway Job 2021: నిరుద్యోగులకు గమనిక..! రైల్వేలో 16000 పోస్టులకు నోటిఫికేషన్.. వెంటనే అప్లై చేయండి..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2ZHSfb3
0 Response to "BRAOU Admissions: అంబేడ్కర్ డిగ్రీ, పీజీ కోర్సుల అడ్మిషన్ల గడువు పెంపు.. ఆఖరు తేదీ ఎప్పుడంటే.."
Post a Comment