
పెద్దవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..! అయితే కచ్చితంగా ఆ వ్యాధే..?

Alzheimers: అల్జీమర్స్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నాడీ సంబంధిత రుగ్మతలలో ఒకటి. ఈ వ్యాధి వల్ల మెదడులో కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. దీంతో మతిమరుపు వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2060 నాటికి అల్జీమర్స్ కేసులు అనేక రెట్లు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాడుక భాషలో చెప్పాలంటే అల్జీమర్స్ అనేది మతిమరుపు వ్యాధి.
ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు జ్ఞాపకశక్తి కోల్పోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, మాట్లాడటంలో ఇబ్బంది, సామాజిక, కుటుంబ సమస్యల తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో ఎక్కడో ఒకచోట తాళాలు లేదా డబ్బు పెట్టి మర్చిపోవడం, స్నానానికి వచ్చి వెంటనే స్నానం చేయాలా వద్దా అనే విషయం మరచిపోవడం, ఇంటి పనుల్లో ఇబ్బంది పడడం, గందరగోళం ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు. వయసు పెరిగే కొద్దీ మెదడులో వచ్చే మార్పులే ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం. ఈ వ్యాధిలో పాత విషయాలన్నీ గుర్తుకు వస్తాయి కానీ కొత్తవి మాత్రమే మరచిపోతారు. ఇది పూర్తిగా నయం కాదు కానీ వైద్యుల సహాయంతో కొంతవరకు తగ్గించవచ్చు.
రోగి సంరక్షణ అత్యంత ముఖ్యమైనది
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. రోగిని చూసుకునే కుటుంబ సభ్యులు చాలా ఓపికగా ప్రవర్తించాలి. పొద్దున్నే పేషెంట్‌కి స్నానం చెయ్యి, భోజనం చెయ్యి అని చెప్పాలి. అందరూ దగ్గరుండి చూసుకోవాలి. కొంతమంది రోగులు ప్రశాంతంగా ఉంటారు మరికొందరు ఆందోళన చెందుతారు. డాక్టర్ సలహాతో రోగిని జాగ్రత్తగా చూసుకోవాలి. విశేషమేమిటంటే ఈ వ్యాధి పెద్దవారిలో (60 ఏళ్ల తర్వాత) మాత్రమే వస్తుంది. ఈ వ్యాధిపై అవగాహన చాలా అవసరం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి కారణంగా మరణించే అవకాశం కూడా ఉంటుంది.
Viral Photos: భూమిపై ఉన్న అందమైన భవంతి ఈ హోటల్.. 6000 అడుగుల ఎత్తులో నిర్మించారు..
Goat Milk: మేక పాలు అమృతం.. అద్భుతం.. విలువ తెలిస్తే జన్మలో వదిలిపెట్టరు..
Delhi Pollution: డేంజర్ జోన్‌లో ఢిల్లీ ప్రజలు.. పెరుగుతున్న కళ్లు మంటలు, గొంతు నొప్పి కేసులు
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3HmL3lD
0 Response to "పెద్దవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..! అయితే కచ్చితంగా ఆ వ్యాధే..?"
Post a Comment