
AP Municipal Elections 2021: కుప్పంలో విజయం ఎవరిది? బుదవారం కౌంటింగ్.. ఫలితంపై ఉత్కంఠ..

Kuppam Election Results: అందరి దృష్టి కుప్పం పైనే. బుధవారం మున్సిపల్ ఎన్నిక కౌంటింగ్. ఫ్యాన్ హవాను తట్టుకొని సైకిల్ నిలపబడుతుందా అన్నది క్వశ్చన్. అటు ఇరు పార్టీల నేతల మధ్య ఓ రేంజ్ డైలాగ్ వార్ నడుస్తోంది.మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీలలో వేడిని పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా నేతల మధ్య మాటలు కాక రేపుతున్నాయి. ప్రధాన పార్టీలు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. దొంగఓట్లు వేయించారన్నది టీడీపీ ఆరోపణ. ఓటమి భయం కనపడుతోందని కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాఖ కావడంతో అక్కడ తమ జెండా పాతాలని వైసీపీ భావించింది. తమ సొంత అడ్డ కాబట్టి మున్సిపల్ విజయం తమదే కావాలని టీడీపీ పట్టుదలకు పోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
కుప్పంలోని మొత్తం 24 వార్డుల్లో 9 వార్డులను సమస్యాత్మకంగా గుర్తించిన పోలీసులు, అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే కుప్పంలో భారీగా దొంగ ఓటర్లు ఉన్నారని టీడీపీ కార్యకర్తలు ఆందోళనతో దిగడంతో కుప్పం రణరంగాన్ని తలపించింది.
మొత్తానికి కుప్పం మున్సిపల్ ఎన్నికలు చంద్రబాబుకి అగ్నిపరీక్షగా మారాయి. ఇజ్జత్ కా సవాల్. మున్సిపల్ వార్‌లో డూ ఆర్ డై సిట్యుయేషన్. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. సొంతగడ్డపై చంద్రబాబుని ఒంటరిగా నిలిపింది. మళ్లీ ఇప్పుడు మరో ఛాలెంజ్ ఎదురౌతోంది. మరి మున్సిపల్ ఎన్నికల్లోనైనా సైకిల్ సత్తా చాటుతుందా? లేక మళ్లీ ఫ్యాన్ హవానే కొనసాగుతుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్.
ఇవి కూడా చదవండి: CM KCR: రైతు దీక్షకు సీఎం కేసీఆర్..? కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన గులాబీ దళం..
Onion Face Pack: ఉల్లిపాయ ఫేస్‌ప్యాక్.. ఇలా చేస్తే తళుక్కుమనే అందం మీ సొంతం..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3oyyA5C
0 Response to "AP Municipal Elections 2021: కుప్పంలో విజయం ఎవరిది? బుదవారం కౌంటింగ్.. ఫలితంపై ఉత్కంఠ.."
Post a Comment