
Badvel By Election Result Live Counting: బద్వేల్ బరిలో ఎవరి సత్తా ఎంత ? మరికాసేపట్లో కౌటింగ్ మొదలు

Badvel By Election Result: బద్వేల్…బరిలో ఎవరి సత్తా ఎంత ? అధికార పార్టీ ప్రకటించినట్లుగా భారీ మెజార్టీ వస్తుందా ? YCPకి గట్టి పోటీ ఇచ్చి ఉనికిని చాటుకోవాలనుకున్న కమలం వ్యూహం ఫలిస్తుందా ? ఈ బైపోల్ వార్‌లో నెగ్గేదెవరూ…తగ్గేదెవరూ ?
ఏకగ్రీవం అవుతుందనుకున్న బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక….BJP పోటీకి దిగడంతో రసవత్తరంగా మారింది. 2019 ఎన్నికల్లో YCP అభ్యర్ధిగా డాక్టర్ వెంకటసుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయితే ఆయన అకాల మరణంతో ఉపఎన్నిక రావడంతో …ఏకగ్రీవం చేయాలని పిలుపునిచ్చింది వైసీపీ. ఇందుకు జనసేన, టీడీపీ పోటీకి దూరంగా ఉంటే…గత ఎన్నికల్లో కేవలం 735 ఓట్లు మాత్రమే వచ్చిన బీజేపీ మాత్రం అభ్యర్దిని బరిలోకి దింపింది.
వరుస విజయాలతో జోష్ మీదుకున్న వైసీపీ బద్వేల్ గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. డిపాజిట్ కూడా రాని బీజేపీ తమకు పోటీ కాదంటూ.. గతంలో వచ్చిన మెజార్టీ కంటె రెట్టింపు తెచ్చుకుంటామని ప్రకటించింది. టీడీపీ, జనసేన బరిలో లేకపోవడంతో రెండు పార్టీల ఓటు బ్యాంక్‌తో ఈసారి కాస్తో.. కూస్తో మైలేజ్ పొందవచ్చని భావించింది బీజేపీ.
తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కొట్టినట్లుగానే బద్వేల్ బైపోల్‌లో కూడా గట్టి దెబ్బ కొట్టాలని వైసీపీ భావించింది. అందుకు తగిన విధంగా నియోజకవర్గ స్థాయిలో పార్టీ అధినాయకత్వంతో విస్తృతస్ధాయి సమావేశాలు నిర్వహించి మెజార్టీపైనే ఫోకస్ పెట్టారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అభ్యర్ధిని ప్రకటించిన నాటి నుంచి పోలింగ్ వరకూ భారీ మెజార్టీ కోసమే పనిచేస్తూ …బీజేపీకి చెక్ పెడుతూ వచ్చారు.
పోలింగ్ రోజున నియోజకవర్గంలో పలుచోట్ల జరిగిన చెదురుముదురు ఘటనలు జరగడంతో బీజేపీ వైసీపీ తీరును తప్పు పట్టింది. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదని.. పోలీసుల్ని అడ్డుపెట్టుకొని రిగ్గింగ్‌లు, బయట వ్యక్తులతో అట్లూరు మండలంలో దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు. తమ ఏజెంట్లను భయబ్రాంతులకు గురి చేశారంటూ 28చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాశినాయన మండలం వరికుంట్లలో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేసారంటూ బీజేపీ అభ్యర్థి సురేష్ ఆందోళనకు దిగారు. ఇవే కాదు పోలింగ్ సమయంలో చింతలచెరువు గ్రామంలో వైసీపీకి ఓటు వేయాలంటూ వాలంటీర్లు సైతం ప్రచారం చేశారన్న ఆరోపణలు చేశారు బీజేపీ నేతలు. అలాగే బద్వేలు 21వ వార్డు వైసీపీ కౌన్సిలర్ భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు.
బీజేపీ విమర్శలను వైసీపీ నేతలు అంతే ధీటుగా తిప్పికొట్టారు. టీడీపీ నేతలే కాషాయ పార్టీకి ఏజెంట్లుగా మారారని కౌంటర్ ఇచ్చారు. వైసీపీ-బీజేపీ మధ్యే కీలక పోరుగా మారిన బైపోల్ వార్‌లో కాంగ్రెస్ కనీసం ఉనికిని కాపాడుకునేందుకు అభ్యర్ధిని బరిలో దింపింది.
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3BzDYtS
0 Response to "Badvel By Election Result Live Counting: బద్వేల్ బరిలో ఎవరి సత్తా ఎంత ? మరికాసేపట్లో కౌటింగ్ మొదలు"
Post a Comment