
AP-Telangana Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షసూచన

దక్షిణ అండమాన్ సముద్రంపై అల్పపీడనం కొనసాగుతోందని వెల్లడించారు ఐఎండీ అధికారులు. ఇది నవంబర్ 15 నాటికి ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం వైపు వెళ్లి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పారు ఆఫీసర్లు. ఇది మరింత బలపడి నవంబర్ 18 నాటికి ఏపీ తీరానికి చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపింది భారత వాతావరణ శాఖ. ఈ అల్పపీడనం కారణంగా నవంబర్ 16 నుంచి 18 మధ్య చాలా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరాలతో పాటు పశ్చిమ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ వెదర్ నివేదిక వెల్లడించింది.
ఇవాళ ఒడిశాలోని ఖోర్దా, పూరి, కటక్, భువనేశ్వర్, నయాగర్, గంజాం, గజపతి, రాయగడ, కంధమాల్, అంగుల్, జాజ్‌పూర్, కేంద్రపరా జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అదే సమయంలో అల్పపీడనం ప్రభావంతో, నవంబర్ 17 నుంచి 19 మధ్య ఒడిశాలోని అనేక జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అటు కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో నిరంతరాయంగా వానలు పడుతున్నాయి. నవంబర్ 16 వరకు కేరళలో ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఒడిశా, కేరళ, కోస్టల్ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. ఇంటీరియర్ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, విదర్భ, మరఠ్వాడా, దక్షిణ కొంకణ్, గోవా, దక్షిణ మధ్య మహారాష్ట్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
Also Read: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. జబర్దస్త్ నుంచి ఔట్!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DggQlM
0 Response to "AP-Telangana Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షసూచన"
Post a Comment