
AP Panchayat Elections Live: ఏపీలో మినీ పల్లె పోరు.. కోవిడ్ జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు..

AP Panchayat Polls: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ పోరు ఆదివారం జరుగనుంది. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచార పర్వం శనివారం ముగిసింది. ఇందులో 36 సర్పంచ్, 68 పంచాయతీ వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతాయి. 15న సోమవారం నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. మున్సిపాలిటీల్లో 365 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తారు. ఈ నెల 16న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తారు. 10 జడ్పీటీసీలు, 163 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగుతాయని అధికారులు తెలిపారు.
ఆదివారం మిగిలిపోయిన గ్రామ పంచాయితీలకు ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మిగిలిపోయిన గ్రామ పంచాయితీలకు ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 69 స్ధానాల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇప్పటికే 30 స్ధానాలు ఏకగ్రీవం అయ్యాయి. 36 పంచాయితీల్లో ఆదివారం సర్పంచ్ స్ధానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఏపీ మినీ పల్లె పోరును ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. పోలింగ్ సందర్భంగా పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతే కాదు సీసీ కెమెరాలతోపాటు వీడియోగ్రాఫర్లను కూడా నియమించామన్నారు. ఇక ఆదివారం మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3kCGIAT
0 Response to "AP Panchayat Elections Live: ఏపీలో మినీ పల్లె పోరు.. కోవిడ్ జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు.."
Post a Comment