-->
Anand Mahindra: ఈ బుడ్డోడిని చూసైనా భయాలను వీడండి.. స్ఫూర్తినిచ్చే వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహింద్రా..

Anand Mahindra: ఈ బుడ్డోడిని చూసైనా భయాలను వీడండి.. స్ఫూర్తినిచ్చే వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహింద్రా..

Viral Video

Motivational Video: ప్రముఖ వ్యాపారవేత్త, ఆటోమొబైల్‌ దిగ్గజ కంపెనీ మహింద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. త‌రుచూ స్ఫూర్తిదాయకమైన, ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. గతంలో ఆయన షేర్‌ చేసిన వీడియో ఒకటి తాజాగా మరోమారు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. తలచుకుంటే.. ఏదీ అసాధ్యం కాదు.. భయాన్ని వీడండి.. ముందడుగు వేయండి అనే విధంగా వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చిన్నారి.. పట్టుదలను చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోలో ఓ బాలుడు ఎత్తైన గోడ‌ను ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటాడు. ప్లే ఏరియాలో ఉండే వాల్‌ను ఎక్కేందుకు బుడ్డోడు ప్రయత్నించి ఓ సారి ఫేయిల్‌ అవుతాడు.. ముందు కొంచెం పైకి ఎక్కాక‌.. ఇంకా పైకి ఎక్కలేక కిందికి దిగుతాడు. మ‌ళ్లీ ఏమైందో కానీ.. మ‌రోసారి ట్రై చేసి పూర్తిగా పైకి ఎక్కుతాడు.

వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహింద్రా.. చాలామందికి ల‌క్ష్యాలు కూడా అసాధ్యం అన్నట్టుగానే అనిపిస్తాయి. కానీ.. ఒక్కసారి నువ్వు నీ ల‌క్ష్యం కోసం అడుగు వేశాక నిన్ను ఎవరూ ఆప‌లేరు.. అంటూ క్యాప్షన్ పెట్టారు. నువ్వు అది చేయ‌లేవని.. నీవ‌ల్ల కాదు అని నిన్ను అంద‌రూ వెన‌క్కి నెట్టేస్తుంటారు. అవేమీ ప‌ట్టించుకోకు. నీ ప‌ని నువ్వు చేసుకుంటూ వెళ్లు.. విజ‌యం నీదే.. అంటూ మహింద్రా స్ఫూర్తినిచ్చారు. ఈ వీడియో చూస్తే అలాంటి భయాలన్నీ మాయమవుతాయని పేర్కొన్నారు.

ఆనంద్ మహింద్రా ట్విట్..

ఈ బుడ్డొడి వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇది తెలిస్తే.. అందరూ విజయం దిశగా అడుగులేస్తారని నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. చాలారోజుల త‌ర్వాత ఓ మంచి మోటివేష‌న‌ల్ వీడియోను ఆనంద్ మ‌హీంద్రా షేర్ చేశారంటూ పలువురు నెటిజ‌న్లు ఆ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

అనంతపురంలో కలకలం రేపిన వివాహిత వీడియో.. తీవ్రంగా స్పందించిన పోలీసులు.. అసలేమైందంటే?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3HptSjo

0 Response to "Anand Mahindra: ఈ బుడ్డోడిని చూసైనా భయాలను వీడండి.. స్ఫూర్తినిచ్చే వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహింద్రా.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel