-->
YCP Vs TDP: కర్నూలు జిల్లాలో స్థల విషయంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ… ఇరువురు నేతలు అరెస్ట్..

YCP Vs TDP: కర్నూలు జిల్లాలో స్థల విషయంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ… ఇరువురు నేతలు అరెస్ట్..

Tdp Vs Ycp

YCP Vs TDP: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ  వైసీపీ , ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య కొన్ని ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు నేతల మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి.  ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ గడప ఎక్కారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలకు చెందిన నేతలను అరెస్ట్ చేశారు. దీంతో నియోజకవర్గం అంతటా హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లా నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి వైసీపీ ముఖ్య నేతలు శ్రీనివాస్ రెడ్డి పవన్ కుమార్ రెడ్డి నవీన్ కుమార్ రెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఎస్సీ ఎస్టీ కేసులు కూడా నమోదయ్యాయి. టిడిపి నుంచి మాజీ కౌన్సిలర్ శాంతి రాజు, నాగ శేషు తదితరులు కూడా అరెస్ట్ అయ్యారు. స్థల వివాదానికి సంబంధించి తమను దూషించడమే కాకుండా వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్ లోనే కొట్టారని టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. తక్షణమే దాడిచేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. స్వయంగా టిడిపి పార్టీ నంద్యాల అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఆ వెంటనే షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరులు ర్యాలీ చేశారు. సిద్ధార్థ రెడ్డి వర్గీయుడు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు, ప్రతి ఫిర్యాదులు తో నందికొట్కూర్ లో కాస్త పొలిటికల్ హిట్ పెరిగింది. రానున్న రోజుల్లో ఇది ఎంతవరకు దారితీస్తుందో అనే చర్చ జరుగుతోంది. పోలీసులు మాత్రం ఇరు పార్టీల నేతలపై కేసులు పెట్టి అరెస్టు చేయడం కొంత ఉద్రిక్తతలను తగ్గించింది.

Also Read: మరో భారీ మల్టీస్టారర్‌కు తెరతీస్తోన్న శ్రీకాంత్‌ అడ్డాలా.. ఈసారి మెగా హీరోలను కలిపేందుకు ప్రయత్నం.?

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EnQmPp

Related Posts

0 Response to "YCP Vs TDP: కర్నూలు జిల్లాలో స్థల విషయంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ… ఇరువురు నేతలు అరెస్ట్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel