
‘Music School’ : శ్రియా శరన్ ప్రధాన పాత్రలో ‘మ్యూజిక్ స్కూల్’.. కీలక పాత్రలో సింగర్ షాన్..

మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందనున్న మ్యూజికల్ మూవీ ‘మ్యూజిక్ స్కూల్’ ఎంతో విశిష్టమైన దసరా రోజున లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు, హిందీ భాషల్లో పాపారావు బియ్యాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం సిద్ధం కావడం అనేది అందరిలో తెలియని ఓ పాజిటివిటీని నింపింది. పాపారావు బియ్యాల దర్శకుడిగా తెలుగు, హిందీ భాషల్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మ్యూజిక్ స్కూల్ మూవీని తెరకెక్కిస్తుండటం సినీ ప్రేక్షకాభిమానుల్లో తెలియని ఓ ఎగ్జయిట్‌మెంట్ క్రియేట్ అయ్యింది. శర్మన్ జోషి, శ్రియా శరన్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సింగర్ షాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
నవంబర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గోవాలో ప్రారంభమవుతుంది. సినిమాలోని 12 సాంగ్స్ సహా అన్నింటికీ సంబంధించిన రిహార్సల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. హాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే, ఆయన అసోసియేట్ పాల్ సౌండెర్ ఇందులో భాగమవుతున్నారు. నేటి విద్యావ్యవస్థలో సృజనాత్మకత లేకుండా పోతుంది. వారిని ఇంజనీర్లు, డాక్టర్లు చేయడమే లక్ష్యంగా విద్యను మూస పద్ధతుల్లో బోధిస్తున్నారు. దీని వల్ల పిల్లల్లో తెలియని ఒత్తిడి నెలకుంటుంది. పిల్లలకు చదువే లోకమైపోతుంది. కళలు, ఆటలు కూడా జీవితంలో భాగమని తెలియడం లేదు. విద్యార్థుల జీవితంలో కళల ప్రభావాన్ని ఇనుమడింప చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్లాలని భావించిన ఈ చిత్రంలో సందర్భానుచితంగా ఆ విషయాలను తెలియజేసేలా హాలీవుడ్ క్లాసిక్ ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్‌లో మూడు పాటలుంటాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :
Sai Dharam Tej: మా ఇంట్లో రెండు పండగలంటున్న మెగా ఫ్యామిలీ.. బ్యాచ్‌లర్‌గా లాస్ట్ బర్త్ డే అంటూ.. సాయి ధరమ్‌కు విశేష్ చెప్పిన మెగా కజిన్స్..
Srikanth on MAA Elections: కొంచెం బాధగా… కొంచెం సంతోషంగా ఉంది.. మరోసారి ‘మా’ ఎలక్షన్స్ పై శ్రీకాంత్ మాటల్లో..(వీడియో)
Jai Bhim: “బాధింపబడ్డ వారికి లభించని న్యాయం.. వాళ్లకు జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది”
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3j77Rez
0 Response to "‘Music School’ : శ్రియా శరన్ ప్రధాన పాత్రలో ‘మ్యూజిక్ స్కూల్’.. కీలక పాత్రలో సింగర్ షాన్.."
Post a Comment