-->
Samantha : శ్రీదేవి మూవీస్ బ్యానర్లో నటిస్తున్న సమంత.. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథతో రానున్న మూవీ.

Samantha : శ్రీదేవి మూవీస్ బ్యానర్లో నటిస్తున్న సమంత.. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథతో రానున్న మూవీ.

Samantha

Samantha: సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌  తెలుగు, తమిళ  భాషల్లో ఓ సినిమా నిర్మించనున్నారు. దీనికి ఇద్దరు యువకులు హరి–హరీష్‌దర్శకత్వం వహించనున్నారు. శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్ నెం 14గా తెరకెక్కనున్నఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. విజయదశమిసందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు.

శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘విభిన్న కథాంశంతో ఈ సినిమా తీస్తున్నాం. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిది. బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’ తీశాను. ఆయనతో మరోమూడు చిత్రాలు చేశాను. నానితో ‘జెంటిల్‌మన్‌’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ నిర్మించాను . ఇప్పుడు  సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. చాలాకొత్తగా ఉంటుందీ సినిమా. సమంతగారు కథ వినగానే ఎగ్జైట్‌ అయ్యారు. వెంటనే ఓకేచెప్పారు. హరి, హరీష్‌ దర్శక ద్వయాన్ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాం. నవంబర్‌లో తెలుగు, తమిళ  భాషల్లో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. అలాగే త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. విడాకుల తర్వాత సమంత నటిస్తున్న మొదటి సినిమా ఇది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sai Dharam Tej: మా ఇంట్లో రెండు పండగలంటున్న మెగా ఫ్యామిలీ.. బ్యాచ్‌లర్‌గా లాస్ట్ బర్త్ డే అంటూ.. సాయి ధరమ్‌కు విశేష్ చెప్పిన మెగా కజిన్స్..

Srikanth on MAA Elections: కొంచెం బాధగా… కొంచెం సంతోషంగా ఉంది.. మరోసారి ‘మా’ ఎలక్షన్స్ పై శ్రీకాంత్ మాటల్లో..(వీడియో)

Jai Bhim: “బాధింపబడ్డ వారికి లభించని న్యాయం.. వాళ్లకు జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది”



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3FTZo8r

Related Posts

0 Response to "Samantha : శ్రీదేవి మూవీస్ బ్యానర్లో నటిస్తున్న సమంత.. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథతో రానున్న మూవీ."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel