-->
Weather: నైరుతి ఉపసంహరణ.. ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం!

Weather: నైరుతి ఉపసంహరణ.. ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం!

Weather Update

Weather: నైరుతి రుతుపవనాలు భారతదేశం నుండి ఉపసంహరించుకున్నాయి. దేశంలోని ఒక ప్రాంతాన్ని మినహాయిస్తే, రాబోయే కొద్ది రోజులు వర్షాలు కురిసే అవకాశాలు చాలా తక్కువ. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల వర్షాలు పడవచ్చు, కానీ వర్షపాతం గురించి ఇంకా స్పష్టమైన అంచనా లేదు. రానున్న 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం తన అంచనాలో పేర్కొంది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి. ఈశాన్య రుతుపవనాల ప్రారంభంలో కాస్త నిదానంగా ఉన్నప్పటికీ తరువాత వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ రాష్ట్రాల్లో అక్టోబర్ 30 వరకు వర్షాలు..

అక్టోబరు 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మహేలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్టోబర్ 29,30 తేదీలలో దక్షిణ అంతర్భాగమైన కర్ణాటక, రాయలసీమలో భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్టోబర్ 28,30 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అక్టోబర్ 30 వరకు కేరళ, మహే, కోస్తా, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కూడా మేఘాలు ఆవరించనున్నాయి.

రాబోయే 6-7 రోజుల పాటు వాయువ్య భారతం, మధ్య, పశ్చిమ భారతదేశం, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుందని ఐఎండీ (IMD) తెలిపింది. దేశంలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదు.

ప్రైవేట్ వాతావరణ సూచన ఏజెన్సీ స్కైమెట్ వెదర్ నివేదిక ప్రకారం బుధవారం తమిళనాడు, కేరళ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో కొన్ని ప్రదేశాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు తీర ప్రాంతాలు, కర్ణాటక తీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: Redmi Note 11: మార్కెట్లోకి రెడ్‌మి నోట్‌ 11 సిరీస్‌ ఫోన్‌లు.. 108 మెగా పిక్సెల్స్‌ కెమెరాతో అదిరిపోనున్న ఫీచర్లు..

Lenovo Tab k10: భారత మార్కెట్లోకి లెనోవో నుంచి కొత్త ట్యాబ్‌.. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో ఆకట్టుకునే ఫీచర్లు..

Health: నిత్యం యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా.? అయితే మీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3vRMbYX

Related Posts

0 Response to "Weather: నైరుతి ఉపసంహరణ.. ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel