-->
Vizag: గ్రామస్తుల రాళ్ల దాడి.. పోలీసుల ఫైరింగ్.. లంబసింగి ఘాట్ రోడ్డులో అసలేం జరిగింది

Vizag: గ్రామస్తుల రాళ్ల దాడి.. పోలీసుల ఫైరింగ్.. లంబసింగి ఘాట్ రోడ్డులో అసలేం జరిగింది

Vizag Police Firing

విశాఖ మన్యం చింతపల్లి మండలం, లంబసింగి ఘాట్ రోడ్డులో హైడ్రామా నడిచింది. నల్గొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు, గ్రామస్తుల మధ్య వివాదం చెలరేగింది. చివరికి రాళ్లు గాల్లోకి లేచాయ్.. తుపాకుల మోతలు మోగాయి. మూడు రోజుల క్రితం బాలకృష్ణ అనే వ్యక్తి ఆచూకీ కోసం వచ్చి.. గాలిపాడుకు చెందిన భీమయ్యను తీసుకుని వెళ్లారు నల్గొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మూడు రోజులుగా అతని ఆచూకీ తెలియకపోవడంతో.. స్థానిక అన్నవరం పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేసారు.

భీమయ్యను తీసుకుని ఇవాళ గాలిపాడు వెళ్తుండగా.. అదే సమయంలో అన్నవరంలో ఉన్న గ్రామస్తులు వెంబడించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వెనుదిరిగినా.. వారిని ఫాలో అయ్యారు. కొంత దూరం వెళ్లాక లారీ అడ్డురావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనాలు నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా దాడిచేసేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో తమని తాము కాపాడుకునేందుకు పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది.

ఈ ఘటనలో కిల్లో రాంబాబు, కామరాజుకు బుల్లెట్లు తగిలాయి. వారిని నర్సీపట్నం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గాలిలోకి మాత్రమే కాల్పులు జరిపామన్నది పోలీసుల వాదన. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లంబ సింగి ఘాట్ రోడ్ లో డౌనూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానిక పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నల్గొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు విశాఖమన్యంలోకి ఎందుకు వెళ్లారు.. బాలకృష్ణ కోసం ఎందుకు వెతుకుతున్నారు.. భీమయ్యను మూడు రోజుల పాటు ఎక్కడికి తీసుకెళ్లారనేది తెలియాల్సి ఉంది. కాగా నల్గొండ పోలీసులు.. లోకల్ పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. గంజాయి కేసులోనే భీమయ్యను నల్గొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలిసింది.

Also Read: మహానటిని మించిపోయింది.. భర్త కనిపించడం లేదని ఫిర్యాదు.. అసలు నిజం తెలిస్తే షాకే

మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. క్షణాల్లో మాంసపు ముద్దలుగా తల్లీ, కొడుకు



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3BUl9Ct

Related Posts

0 Response to "Vizag: గ్రామస్తుల రాళ్ల దాడి.. పోలీసుల ఫైరింగ్.. లంబసింగి ఘాట్ రోడ్డులో అసలేం జరిగింది"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel