
Vishal: పునీత్ బాధ్యతను నేను కొనసాగిస్తా.. సంచలన నిర్ణయం తీసుకున్న హీరో విశాల్..

PuneethRajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం యావత్ సినీప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచింది. రీల్ హీరోగానే కాకుండా ఎనో సేవ కార్యక్రమాలతో ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్నాడు పునీత్. 1500 మందికి పైగా పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు పునీత్. 45 ఫ్రీ స్కూల్స్ , 26 అనాధాశ్రమాలు, 16 వృద్దాశ్రమాలు, 19 గోశాలలు కట్టించారు పునీత్. అంతే కాదు చనిపోయిన తర్వాత కూడా ఒకరికి కంటివెలుగు అయ్యారు పునీత్. ఆయన తన రెండు కళ్ళను దానం చేశారు. అదే విధంగా తమిళ్ హీరో విశాల్ కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నారు. సినిమాలతోపాటు రైతులకు, పేద ప్రజలకు సాయం చేస్తూ.. వారిని ఆడుకుంటున్నాడు విశాల్. తాజాగా విశాల్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
తన స్నేహితుడైన పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన చదివిస్తున్న 1500 మంది పిల్లల బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు ప్రకటించారు విశాల్. ఇటీవల ఆయన నటించిన ఎనిమి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆయన విశాల్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే విశాల్ నటించిన సినిమాలకు సంబంధించిన ప్రతి టికెట్ ధర నుంచి ఒక రూపాయి రైతులకు చేరేలా చేస్తున్నారు. అంతే కాదు తనకు సంబంధించిన ఫంక్షన్స్ లో బొకేలను వాడొద్దని వాటికీ ఉపయోగించే డబ్బు ఆడపిల్లల చదువుకు ఉపయోగించమని కోరుతూ ఉంటారు విశాల్. ఇక ఇప్పుడు ఇలా పునీత్ బాధ్యతను తన భుజాలపై వేసుకొని మరోసారి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు విశాల్.
I will take care of those 1,500+ students on behalf of my brother #PuneethRajkumar
– @VishalKOfficial at #Enemy Pre Release Event
— Vamsi Kaka (@vamsikaka) October 31, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
Mehreen Pirzada: ఆ ఇద్దరు హీరోయిన్స్‌లా సినిమాలు చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన మెహ్రీన్..
Bommarillu Bhaskar: మరో మెగా పవర్ ఆఫర్ కొట్టేసిని బొమ్మరిల్లు భాస్కర్.. ఇది నిజమేనా అంటున్న అభిమానులు.. (వీడియో)
Anubhavinchu Raja: ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి హాయిగా నవ్వుకునే సినిమా మాది: రాజ్ తరుణ్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3GC34vH
0 Response to "Vishal: పునీత్ బాధ్యతను నేను కొనసాగిస్తా.. సంచలన నిర్ణయం తీసుకున్న హీరో విశాల్.."
Post a Comment