British Fence: గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా.. మహా ముళ్ల కంచె ఎక్కడో తెలుసా..? 4వేల కిలోమీటర్ల పొడవు సాధ్యమేనా..?(వీడియో)

బ్రిటిష్ ప్రభుత్వం 1870లో ప్రస్తుత పాకిస్థాన్‌లోని సింధు నది నుంచి ఒడిశాలోని మహానది దాకా 4వేల కిలోమీటర్ల పొడవున ఓ కంచెను నిర్మించింది. అప్పట్లో కచ్ లోనూ, ఒడిశాలోనూ ఉప్పు ఉత్పత్తి అయ్యేది. ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్ణయించిన ధరకే ఉప్పు అమ్మేవారు. అవి సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. దీంతో జనం గిడ్డంగుల నుంచి ఉప్పు దొంగిలించసాగారు. కొంతమంది చట్టవిరుద్ధంగా తయారుచేసి చాటుగా అమ్మేవారు. దీన్ని అరికట్టడానికి తెల్లవారు… గోడకట్టాలని యోచించారు.
బ్రిటిష్ ప్రభుత్వంలో కస్టమ్స్ అధికారిగా పనిచేసిన హ్యూమ్ కు ఓ ఆలోచన వచ్చింది. ముళ్ల చెట్లు, పొదలతో దట్టమైన కంచె పెంచడం మొదలుపెట్టారు. ఈ కంచె వేయడానికి తుమ్మ వంటి ముళ్ల చెట్లు, ముళ్ల పొదలను వినియోగించారు. ఇప్పటికీ మనం పిలిచే ఇంగ్లిష్ తుమ్మ ఇదే! చవుడు నేలల్లో కూడా ముళ్ల చెట్లు పెంచడానికి నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల కంచె వెడల్పు 14 అడుగులు కూడా ఉండేది. 1869లోనే కంచె నిర్మాణానికి 20 లక్షల ఘనపుటడుగుల మట్టి తవ్వి, లక్షన్నర టన్నుల ముళ్ల కంపలు తీసుకొచ్చారు. దీని నిర్వహణకు 1872లోనే 14,000 మంది సిబ్బందిని వినియోగించారు. ఈ సుదీర్ఘ కంచెను అంతర్గత కస్టమ్స్ రేఖగా వ్యవహరించారు.
జనం ఒంటెల ద్వారా, ఎడ్ల బళ్ల ద్వారా ముళ్ల కంచెను దాటి ఉప్పు రవాణా చేసేవారు. లేదా కంచె ఇవతల నుంచి అవతలికి ఉప్పు బస్తాలు విసిరేసేవారు. రానురానూ మహా కంచె మహా గందరగోళంగా, నిర్వహణ భారంగా తయారవడంతో బ్రిటిష్‌వారు అక్కడక్కడా కాకుండా దేశవ్యాప్తంగా ఏకరూప పన్ను విధించారు. దీంతో సరకు దొంగరవాణా లాభం లేని వ్యవహారమైంది. మహా కంచె కస్టమ్స్‌లైన్ నిర్వీర్యమైపోయింది. ప్రజలు ఎక్కడికక్కడ… దీన్ని తగలబెట్టారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..
Vijay Sethupathi Bike Photos: BMW బైక్ కొన్న ‘మక్కల్ సెల్వన్’.. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ‘విజయ్ సేతుపతి’.. వైరల్ అవుతున్న ఫొటోస్..
Japan princess : ప్రియుడి కోసం ప్యాలెస్‌ను వీడిన జపాన్ యువరాణి.. భావోద్వేగంలో పీఎం..(వీడియో)
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3pT2BiQ


0 Response to "British Fence: గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా.. మహా ముళ్ల కంచె ఎక్కడో తెలుసా..? 4వేల కిలోమీటర్ల పొడవు సాధ్యమేనా..?(వీడియో)"
Post a Comment