
Vishal 32 : ప్రీ లుక్‌తో అదరగొట్టిన విశాల్.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న మూవీ..

Vishal : హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు తమిళ్ స్టార్ హీరో విశాల్. ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ ఇటీవలే మరో సినిమాను పట్టాలెక్కించి విషయం తెలిసిందే. ‘ఎనిమీ’ ‘సామాన్యుడు షూటింగ్లను పూర్తి చేసిన విశాల్. ఇప్పుడు ఎ. వినోద్‌కుమార్ దర్శకత్వంలో ఒక హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించనున్నారు. ఇటీవల విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ చెన్నైలోని ప్రసిద్ద సాయిబాబా దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. రానా ప్రొడక్షన్స్ పతాకంపై రమణ, నంద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో విశాల్‌కు జోడీగా సునైన నటిస్తోంది. ఈ సినిమాకోసం మేకర్స్ పవర్‌ఫుల్ టైటిల్‌ను కన్ఫర్మ్ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడాన్ని ప్రభావితం చేసే అంశం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తుంది.
ఈ సినిమాకు అన్ని భాషలకు ఒకే టైటిల్ ఉండనుందని తెలుస్తుంది. ఈ క్రమంలో టైటిల్ లుక్ ప్రీ లాంచ్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. విశాల్ ఇప్పటికే ఎన్నో యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌లో నటించారు. అయితే ఈ సినిమా వాటికి భిన్నంగా ఉండనుంది. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ తప్పకుండా ప్రేక్షకులను అలరించనున్నాయి. సెకండ్ హాఫ్ లో దాదాపు 40 నిమిషాల యాక్షన్ బ్లాక్స్ హైలైట్ గా నిలుస్తాయని.. ఫైట్ మాస్టర్ దిలిప్ సుబ్బరాయన్ ఈ యాక్షన్ సీక్వెన్స్ లను డిజైన్ చేస్తున్నారని తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Manchu Vishnu: ‘MAA’ లో కొనసాగుతున్న చిటపటలు.. కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు ఏం చేయబోతున్నారు?
Rakul Preet Singh: స్విమ్మింగ్ పూల్‌లో రకుల్ ప్రీత్ జలకాలాట.. తిరిగి ఆ రోజుల్లోకి వెళ్లాలని ఉందంటా..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2YPh1ow
0 Response to "Vishal 32 : ప్రీ లుక్‌తో అదరగొట్టిన విశాల్.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న మూవీ.."
Post a Comment