-->
Taapsee Pannu : హీరోలకు పోటీగా ఫిజిక్ కోసం కష్టపడ్డ బాలీవుడ్ బ్యూటీ.. రష్మీ రాకెట్ కోసం తాప్సీ ఇలా…

Taapsee Pannu : హీరోలకు పోటీగా ఫిజిక్ కోసం కష్టపడ్డ బాలీవుడ్ బ్యూటీ.. రష్మీ రాకెట్ కోసం తాప్సీ ఇలా…

Taapsee Pannu

Taapsee Pannu : తాప్సీ.. హీరోయిన్ గా తెలుగులో పరిచయం అయినప్పటికీ బాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అటు బాలీవుడ్‏లోనూ అవకాశాలను అందుకుంది తాప్సీ. అదే సమయంలో అక్కడ ఆమెకు సూపర్ హిట్స్ లభించడంతో.. పూర్తిగా బాలీవుడ్‏కు షిఫ్ట్ అయ్యింది ఈ పంజాబీ బ్యూటీ. అటు వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ఫ్లాట్‏ఫాంలలోనూ తాప్సీ దూసుకుపోతుంది. అలాగే తమిళ్‌‌‌‌లోనూ సినిమాలు చేస్తోంది. ఇక ఈ చిన్నది లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంటోంది. ఇటీవలే తమిళ్ లో విజయ్ సేతుపతితో కలిసి అనేబెల్లా సేతుపతి సినిమాలో చేసింది ఈ సొట్టబుగ్గల సిందరి. ఇక ఇప్పుడు బాలీవుడ్ మూవీ రష్మీ రాకెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అథ్లెట్ బ్యాక్‌ డ్రాప్‌లో కొనసాగే ఈ సినిమాలో రన్నర్‌ పాత్ర పోషిస్తోంది. తన గుర్తింపు కోసం పోరాడి అథ్లెట్‌ గా రాణించిన ఓ రన్నర్‌ పాత్రను తాప్సీ పోషిస్తోంది. ఆకర్ష్‌ ఖురానా డైరెక్షన్‌ వహిస్తున్న ఈ మూవీలో ప్రయాన్షు పెన్యులి తాప్సీ భర్తగా నటిస్తున్నారు.రష్మీ రాకెట్ అనే సినిమా కోసం తాప్సీ పడ్డ కష్టం అంతా ఇంత కాదట. ఆమె ఫిజిక్ విషయంలో అథ్లెట్ లా కనిపించేందుకు గాను చాలా కష్టపడిందట. ఫిజిక్ ఫిట్ నెస్ తో కనిపించడం కోసం ప్రతి ఒక్క వర్కౌట్ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది తాప్సీ. పాత్రకు తగ్గట్లుగా కథానుసారంగా ఫిజిక్ ను మార్చుకోవడానికి ఎక్కువగా హీరోలు కష్టపడుతుంటారు. కానీ ఈ సినిమాకోసం ఇందిలోని పాత్రకోసం తాప్సీ తన ఫిజిక్ ను ఓ అథ్లెట్ లా మార్చుకోవడం పై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lzCT0d

0 Response to "Taapsee Pannu : హీరోలకు పోటీగా ఫిజిక్ కోసం కష్టపడ్డ బాలీవుడ్ బ్యూటీ.. రష్మీ రాకెట్ కోసం తాప్సీ ఇలా…"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel