
Viral Video: బ్రిడ్జి కింద చిక్కుకున్న విమానం..! రోడ్డుపైకి ఎందుకొచ్చినట్లు..? వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఒక విమానం వీడియో వైరల్‌గా మారింది. ఢిల్లీ-గురుగ్రామ్ హైవేపై ఫుట్ ఓవర్‌బ్రిడ్జి కింద ఎయిర్ ఇండియా విమానం ఇరుక్కుపోయి కనిపించింది. ఇప్పుడు ఈ విమానం చిత్రాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అదేంటి విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోవడమేంటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ విమానం ఇక్కడికి ఎలా చేరిందని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
అయితే ఈ వీడియో చూసిన ఎయిర్‌లైన్స్ అధికారులు స్పందించారు. అసలు వివరాలను వెల్లడించారు. విమాన ప్రమాదం ఏమి జరగలేదని ప్రకటించారు. అయితే ఇది ఒక పాత, ఆగిపోయిన విమానం అని దీనిని ఎయిర్ ఇండియా విక్రయించిందని తెలిపారు. విమానం యజమాని దీనిని రోడ్డు మార్గం ద్వారా తీసుకెళుతున్నప్పుడు ఇలా అనుకోకుండా బ్రిడ్జి కింద ఇరుక్కుపోయినట్లు తెలిపారు. విమానం చుట్టూ వాహనాలు వెళుతుండటం మనం వీడియోలో చూడవచ్చు. అదే సమయంలో హైవేపై చాలా రద్దీ కూడా కనిపిస్తోంది.
మరోవైపు విమానం ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విమానం ముందు భాగం ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్ కింద దాటింది కానీ వెనుక భాగం ఇరుక్కుపోయింది. ఈ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వీడియో చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. ఒక నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. మొదటిసారిగా రోడ్డుపై విమానం చూస్తున్నానని అన్నాడు. మరికొందరు రోడ్డుపై కూడా విమానం ప్రయాణానికి అనుమతి ఇచ్చారా అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియోను నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
#WATCH An @airindiain plane
(not in service) got stuck under foot over bridge. Can anyone confirm the date and location?
The competition starts nowpic.twitter.com/pukB0VmsW3
— Ashoke Raj (@Ashoke_Raj) October 3, 2021
Lakhimpur Kheri clash: ‘నా కొడుకు కారులో లేడు.. ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపారు’ : కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా
Aryan Khan Drugs Case: ఆర్యన్ అరెస్ట్ తరువాత షారుఖ్‌ని కలవడానికి వెళ్లిన సల్మాన్‌ఖాన్..
Lakhimpur Kheri clash: లఖింపూర్ ఖేరీ ఘటన దురదృష్టకరం.. బాధ్యులపై కఠిన చర్యలు : సీఎం యోగి ఆదిత్యానాధ్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3FcXTSd
0 Response to "Viral Video: బ్రిడ్జి కింద చిక్కుకున్న విమానం..! రోడ్డుపైకి ఎందుకొచ్చినట్లు..? వైరల్ అవుతున్న వీడియో.."
Post a Comment