-->
Crime news: భాగ్యనగరంలో కారు బీభత్సం.. యువతి దుర్మరణం.. నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే..

Crime news: భాగ్యనగరంలో కారు బీభత్సం.. యువతి దుర్మరణం.. నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే..

Road Accident

Hyderabad – Hitex Car Accident: హైదరాబాద్ నగర పరిధిలోని మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. సీఐఐ జంక్షన్ వద్ద ఆగివున్న ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే.. యువతి మరణిచించడం, యువకుడికి తీవ్ర గాయాలుకావడంతో.. ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సైనిక్‌పురిలో నివాసం ఉండే టి.అజయ్, జెన్నిఫర్ డిక్రూజ్ మాదాపూర్ ఐటీ జోన్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఇటీవల వారిద్దరికీ పెళ్లి సంబంధం కుదరగా.. పెద్దల సమక్షంలో ఘనంగా నిశ్చితార్ధం జరిగింది. త్వరలో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే.. అజయ్, జెన్నిఫర్ శనివారం గచ్చిబౌలిలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. ఆదివారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనంపై కొత్తగూడ వైపు నుంచి సైబర్ టవర్ వైపు వస్తున్న క్రమంలో.. సీఐఐ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో బైక్ ఆపారు. ఈ క్రమంలో వెనక వైపు నుంచి వేగంగా వచ్చిన మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ కారు రాయల్ ఎన్‌ఫిల్డ్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు కింద పడిపోయారు.

ద్విచక్రవాహనం వెనక కూర్చున్న జెన్నిఫర్ తలకు బలమైన గాయాలు కావడంతో సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే‌ జన్మిఫర్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. బైక్ నడుపుతున్న అజయ్ ఎడమ చేయి, ఎడమ కాలు, వెన్నముకకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడు. మృతురాలి తండ్రి జాన్ సిరిల్ డిక్రూజ్ ఫిర్యాదు మేరకు‌ కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Aryan Khan Drugs Case: ఆర్యన్ అరెస్ట్ తరువాత షారుఖ్‌ని కలవడానికి వెళ్లిన సల్మాన్‌ఖాన్‌..

Rape: 40 ఏళ్ల మహిళతో యువకుడి స్నేహం.. సహజీవనం చేయలంటూ ఒత్తిడి.. చివరికి..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3A4B8w1

0 Response to "Crime news: భాగ్యనగరంలో కారు బీభత్సం.. యువతి దుర్మరణం.. నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel