
Vaccination: ఆ రోజు వ్యాక్సిన్ తీసుకుంటే వాషింగ్ మిషన్, మిక్సర్ గ్రైండర్లు..! ఎక్కడో తెలుసా..?

Vaccination: దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. చాలామంది వ్యాక్సిన్ మాత్రమే ఈ సంక్షోభం నుంచి కాపాడగలదని నమ్ముతున్నారు. దీంతో దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది.అయితే కొన్ని రాష్ట్రాలలో టీకాలకు సంబంధించి సమస్య ఇంకా కొనసాగుతోంది. కొంతమంది టీకా తీసుకోవడానికి చాలా భయపడుతున్నారు. దీంతో ప్రభుత్వాలు, అధికారులు అందరు వ్యాక్సిన్ వేసుకోవడానికి రకరకాల మార్గాలు వెతుకుతున్నారు.
ఇందులో భాగంగానే బహుమతులు, లక్కీడ్రాలు, ఉచితాలు వంటి ఆఫర్లను ప్రకటిస్తున్నారు. తాజాగా తమిళనాడులోని కరూర్ జిల్లా అధికారులు కూడా ఇలాగే చేశారు. ఆదివారం జరగనున్న మెగా డ్రైవ్‌లో టీకా తీసుకునే వారికి బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి.. వాషింగ్ మెషిన్, వెట్ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్‌తో సహా పలు బహుమతులను అందిస్తామన్నారు.
ఈ మేరకు కరూర్ జిల్లా కలెక్టర్ టి.ప్రభు శంకర్ పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. మొదటి మూడు స్థానాల విజేతలకు వాషింగ్‌మెషిన్, వెట్ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్ అందజేయనున్నారు. 24 ప్రెజర్ కుక్కర్లు, 100 ప్రోత్సాహక బహుమతులు కూడా ఉన్నట్లు తెలిపారు. అలాగే టీకా కేంద్రాలకు లబ్ధిదారుల్ని తీసుకువచ్చినవారికి రూ.5 ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. 25 మంది కంటే ఎక్కువమందిని తీసుకువచ్చే వాలంటీర్ పేరు లక్కీ డ్రాలో చేర్చుతామన్నారు.
ఈ వినూత్న ప్రయత్నాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ప్రశంసించారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయడానికి కరూర్ జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని అందరు అభినందిస్తున్నారు. దీంతో ఆదివారం వ్యాక్సిన్ మేళాకు భారీగా ప్రజలు తరలిరానున్నారు. వారికోసం అధికారులు ఇప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చూడాలిమరి ఎవరెవరికి ఎన్ని బహుమతులు లభిస్తాయో..
CM Dance: స్టెప్పులేసిన ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్.. వీడియో వైరల్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/309GF8q
0 Response to "Vaccination: ఆ రోజు వ్యాక్సిన్ తీసుకుంటే వాషింగ్ మిషన్, మిక్సర్ గ్రైండర్లు..! ఎక్కడో తెలుసా..?"
Post a Comment