
IPL 2021, MI: హతవిధి.. భారీ స్కోరు చేసి గెలిచినా.. ఓడినట్లే అయింది ముంబై పరిస్థితి..

IPL 2021, MI: ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొమ్మిది వికెట్లకు 235 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై తరఫున ఇషాన్ కిషన్ 84 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 82 పరుగులు చేశాడు.ఇంత భారీ విజయం సాధించినప్పటికీ ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌లో చోటు సంపాదించలేకపోయింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోరు 70 పరుగులు దాటిన వెంటనే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు ఆవిరయ్యాయి. ఎందుకంటే ముంబై ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే హైదరాబాద్ 70 పరుగులకే ఆలౌట్ కావాలి. కానీ సన్‌రైజర్స్ 9 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. దీంతో ఈ ఎఫెక్ట్ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ పై పడింది. ఈ సీజన్‌లో SRH జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. హైదరాబాద్ కోసం మనీష్ పాండే ఒంటరి పోరాటం చేశాడు. 41 బంతుల్లో 69 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. జాసన్ రాయ్ 34 పరుగులు, అభిషేక్ శర్మ 33 పరుగులు చేశారు.
మ్యాచ్ తర్వాత ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ “ఈ మ్యాచ్‌లో మేము చాలా బాగా ఆడాం. గెలిచినందుకు సంతోషంగా ఉంది. అభిమానులు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అంతకు మించి ఇంకే లేదు” అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ప్లేఆఫ్‌లో చోటు సంపాదించాయి.
Hyderabad Rains: హైదరాబాద్ అస్తవ్యస్తం.. మూడు గంటల వర్షానికి ఆగమాగం..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3AkLyrH
0 Response to "IPL 2021, MI: హతవిధి.. భారీ స్కోరు చేసి గెలిచినా.. ఓడినట్లే అయింది ముంబై పరిస్థితి.."
Post a Comment