
Union Bank Of India: హోమ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా.? భారీగా వడ్డీరేట్లు తగ్గించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

Union Bank Of India: కొత్తింటి కలను ఈ ఏడాదిలో సాకారం చేసుకోవాలనుకుంటున్నారా.? పండుగ సంబరాల వేళ ఓ ఇంటి వారు అవుదామనుకుంటున్నారా? మీలాంటి వారి కోసమే యూనియన్ బ్యాంక్ ఓ బంపరాఫర్‌ను ప్రకటించింది. హోమ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి గతంలో ఎన్నడూ లేనంత తక్కువ వడ్డీకే గృణ రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయమై బ్యాంకు అధికారులు తాజాగా అధికారిక ప్రకటన చేశారు. తమ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లను 6.40 శాతానికి తగ్గించినట్లు యూనియన్ బ్యాంక్ అధికారులు మంగళవారం ప్రకటించారు.
తగ్గిన ఈ వడ్డీరేట్లు అక్టోబర్ 27, 2021 నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వడ్డీరేట్లు కొత్తగా హౌజ్ లోన్ తీసుకునే వారితో పాటు, ఇప్పటికే ఉన్న గృహ రుణాలను తమ బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకునే వారికి కూడా ఈ అవకాశాన్ని కలిపించింది. ఈ విషయమై బ్యాంకు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘పండుగల నేపథ్యంలో ఇళ్ల కొనుగోళ్లు బాగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో మేము తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం యూనియన్ బ్యాంకు అందించనున్న ఈ వడ్డీరేట్లు మార్కెట్లో మరే బ్యాంకు కూడా అందించడం లేదు’ అని చెప్పుకొచ్చారు.
Also Read: Bribery Case: లంచం కేసులో ఇద్దరు కస్టమ్స్ అధికారుల అరెస్ట్.. హైదరాబాద్‌లో కలకలం..
Big News Big Debate: బద్వేలు ప్రీమియర్ లీగ్ – BPL వార్‌లో పేలుతోన్న మాటల తూటాలు
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CjdX37
0 Response to "Union Bank Of India: హోమ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా.? భారీగా వడ్డీరేట్లు తగ్గించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.."
Post a Comment