-->
Adipurush: సైలెంట్‌గా షూటింగ్‌ పూర్తి చేస్తోన్న ప్రభాస్‌.. తుది దశకు చేరుకుంటున్న ఆది పురుష్‌ చిత్రీకరణ..

Adipurush: సైలెంట్‌గా షూటింగ్‌ పూర్తి చేస్తోన్న ప్రభాస్‌.. తుది దశకు చేరుకుంటున్న ఆది పురుష్‌ చిత్రీకరణ..

Prabhas Adi Purush

Adipurush: ‘సాహో’ తర్వాత కాస్త గ్యాప్‌ ఇచ్చిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం స్పీడు పెంచారు. వరుస సినిమాలకు ఓకే చెప్పి ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచారు. బహుశా ప్రభాస్‌ తన కెరీర్‌లో ఒకేసారి ఇన్ని సినిమాల్లో నటించడం ఇదే తొలిసారి కావొచ్చు. రాధేశ్యామ్‌, ఆదిపురుష్, సలార్‌, నాగ్‌ అశ్విన్‌ చిత్రం, సందీప్‌ వంగ డైరెక్షన్‌లో మరో చిత్రం ఇలా ఏకంగా 5 సినిమాలను లైన్‌లో పెట్టారు ప్రభాస్‌. అందూలోనే ఇవన్నీ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని షేక్‌ చేసే సినిమాలే కావడం విశేషం. ఇదిలా ఉంటే ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్‌ విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.

ఇక ప్రభాస్‌ నుంచి వస్తోన్న మరో మోస్ట్‌ వాంటెడ్‌ మూవీ ఆదిపురుష్‌. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. త్రీడీలోనూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగానే సినిమా చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రావణ పాత్రధారి సైఫ్‌ అలీఖాన్‌, సీత పాత్రలో నటిస్తోన్న కృతి సనన్‌ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రాముడి పాత్రలో నటిస్తున్న ప్రభాస్‌కు సంబంధించిన షూటింగ్‌ జరుగుతోంది.

ప్రభాస్‌ పార్ట్‌ను కూడా వచ్చే నెలఖారుకు పూర్తిచేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. ప్రోస్ట్ ప్రొడక్షన్​ పనులు ప్రారంభించడానికి ముందే రెబల్​స్టార్​కు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయాలని దర్శకుడు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న సినిమా కావడంతో త్వరగా షూటింగ్‌ పూర్తి చేసుకొని ఆ పనులు మొదలు పెట్టాలని చిత్ర యూనిట్‌ భావిస్తోందని సమాచారం.

Also Read: Fire Accident: తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం.. మరో పది మంది..

Palnadu Politcs: ఎమ్మెల్యే కాసు, యరపతినేని మధ్య రాజకీయ వైరం కొత్త టర్న్‌.. పౌరుషాల గడ్డ పల్నాడులో వైసీపీ నేతల ‘గాంధీ’గిరి

Palnadu Politcs: ఎమ్మెల్యే కాసు, యరపతినేని మధ్య రాజకీయ వైరం కొత్త టర్న్‌.. పౌరుషాల గడ్డ పల్నాడులో వైసీపీ నేతల ‘గాంధీ’గిరి



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3nvOcX2

0 Response to "Adipurush: సైలెంట్‌గా షూటింగ్‌ పూర్తి చేస్తోన్న ప్రభాస్‌.. తుది దశకు చేరుకుంటున్న ఆది పురుష్‌ చిత్రీకరణ.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel