-->
Telugu Academy: తెలుగు అకాడమీలో స్కామ్‌లో మరో కొత్త కోణం.. సాయికుమార్‌ ముఠాపై పోలీసుల స్పెషల్ ఫోకస్..

Telugu Academy: తెలుగు అకాడమీలో స్కామ్‌లో మరో కొత్త కోణం.. సాయికుమార్‌ ముఠాపై పోలీసుల స్పెషల్ ఫోకస్..

Ed On Telugu Acadami Scam

తెలుగు అకాడమీలో స్కామ్‌లో కొత్త కోణం బయటపడింది. ఏపీలోని రెండు సంస్థల నుంచి సాయికుమార్‌ ముఠా డబ్బులు కొట్టేసింది. ఏపీ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ 10 కోట్ల రూపాయలు కొట్టేయడం కలకలం రేపుతోంది. ఆంధ్ర ప్రదేశ్ సీట్స్ కార్పొరేషన్ నుంచి 5కోట్ల ఎఫ్‌డీలను సాయికుమార్‌ డ్రా చేశారు. ఏపీకి చెందిన రెండు సంస్థల నుంచి సాయికుమార్‌ 15 కోట్లు డ్రా చేశారు. ఇవన్నీ ఐవోబీ బ్యాంకు నుంచి ఏపీ మర్కంటైల్‌ కోపరేటివ్‌ సొసైటీకి నిధులు బదిలీ చేసి.. ఆ తర్వాత విత్‌ డ్రా చేశారు. ఏపీకి చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కాజేసినట్లుగా సీసీఎస్‌ పోలీసులు గుర్తించి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. సాయికుమార్‌ ముఠాపై రెండు కేసులు నమోదు చేసేందుకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేశారు.

తెలుగు అకాడమీలో 64.5కోట్ల రూపాయల కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే. అకాడమీలో అందరి పాత్ర ఉందని తేలింది. ఈ భారీ స్కాంలో నిధులను మళ్లించడమే కాకుండా.. ఆ సొమ్ములతో స్థిరాస్తును కొనుగోలు చేసినట్లు గుర్తించారు ఈడీ అధికారులు. ఈక్రమంలో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు అధికారులు.

తెలుగు అకాడమీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు సాయి అనుచరుడు రమణారెడ్డి, మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి పీఏ వినయ్, నకిలీ పత్రాలతో సంబంధమున్న భూపతిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ముగ్గురే కథ మొత్తం నడిపినట్లుగా అంచనా వేస్తున్నారు అధికారులు. ఇప్పటివరకూ ఈ కేసులో 14 మందిని అరెస్ట్‌ చేశారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారిస్తోంది. అకాడమీ అకౌంట్స్ అధికారి రమేష్‌తో పాటు సోమిరెడ్డిని ఇప్పటికే ప్రశ్నించారు ఈడీ అధికారులు.

దోచుకున్న డబ్బు.. ఏ విధంగా దాచుకున్నారు..? ఎక్కడ దాచారు? ఎందులో పెట్టుబడులు పెట్టారనే అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వెంకట్‌ సాయికుమార్‌ 35ఎకరాల స్తలం కొనుగోలు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. మరో నిందితుడు వెంకటేశ్వర్‌రెడ్డి కూడా సత్తుపల్లిలో ఓ భారీ బిల్డింగ్ కొనుగోలు చేసినట్లుగా తేల్చారు.

వీళ్లతో పాటు బ్యాంక్‌ మేనేజర్లు మస్తాన్‌ వలీ, సాధన దోచుకున్న డబ్బుతోనే ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు ఈడీ అధికారులు. తెలుగు అకాడమీ డిపాజిట్లతో ఆర్థిక మోసాలకు పాల్పడిన నిందితుల ఆస్తులను గుర్తించిన ఈడీ అధికారులు వాటిని జప్తు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: Prime Minister Narendra Modi: అఫ్గన్లకు తక్షణ ఆపన్న హస్తం అందించాలి.. G20 సదస్సులో ప్రధాని మోడీ పిలుపు

Political Story: గాంధీ పేరుతో బతకడం కోసం పాకులాట!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3p4YDTI

Related Posts

0 Response to "Telugu Academy: తెలుగు అకాడమీలో స్కామ్‌లో మరో కొత్త కోణం.. సాయికుమార్‌ ముఠాపై పోలీసుల స్పెషల్ ఫోకస్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel