
Syria’s Afrin : మరోసారి నెత్తుటితో తడిచిన సిరియా.. బాంబ్ ఎటాక్స్‌తో దద్దరిల్లిన అఫ్రిన్. గాలిలో కలిసిపోయిన అమాయకుల ప్రాణాలు..

Syria’s Afrin: సిరియాలో నెత్తుటిధారలు పారాయి. అఫ్రిన్‌లో జరిగిన కార్ బాంబ్ పేలుడులో అనేక మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో సుమారు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబ్ దాడిలో పలు షాపులు ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి వీధుల్లో శిథిలాలు వచ్చిపడ్డాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పదుల సంఖ్యలో ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. కార్ బాంబ్ ఎటాక్‌తో సమీప ప్రాంతాల వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జనాలు భయంతో వణికిపోయారు.
సిరియాలో ఈ మధ్య ఉద్రిక్తతలు దాదాపుగా చల్లారాయి. ఐసిస్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. లేటెస్ట్‌గా మళ్లీ కారు బాంబ్ ఎటాక్ కలకలం సృష్టిస్తోంది. సిరియాలో మళ్లీ పాత పరిస్థితులు రాబోతున్నాయా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో సిరియాలో రోజుకో చోట రక్తపాతం జరిగేది. ఐసిస్ ఉగ్ర స్థావరంగా సిరియాకు పేరుంది. అలాంటి సిరియాలో ఇప్పుడిప్పుడే దాడులకు ఫుల్‌స్టాప్ పడింది. అయితే.. తాజా ఘటన సిరియాను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది.
నార్తర్న్ సిరియాను టర్కీ రెబెల్ చేజిక్కించుకున్న నాటి నుంచీ చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 2016లో ఐఎస్‌ఐఎస్ నుంచి స్వాధీనం చేసుకున్న ఈ ప్రాంతంలో టర్కీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది సిరియా. టర్కీ దళాలను టెర్రర్ గ్రూప్‌గా అభివర్ణిస్తోంది. అఫ్రిన్‌లో జరిగిన కార్ బాంబ్ ఎటాక్ కూడా ఆ దళాల పనేనని అనుమానిస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి:
New Technology: గోడ అవతల ఉన్నవారిని గుర్తించే పరికరం రెడీ.. శత్రు జాడల్ని గుర్తించడం ఇక ఈజీ!
Nepal Bus Accident: పండుగ పూట విషాదం.. లోయలో పడిపోయిన బస్సు.. 28 మంది దుర్మరణం!
Viral Post: ‘నీలిరంగు రాయి’ ఇచ్చి ఐస్ క్రీం కొనుగోలు చేసిన చిన్నారి.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న పోస్ట్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DQmyL9
0 Response to "Syria’s Afrin : మరోసారి నెత్తుటితో తడిచిన సిరియా.. బాంబ్ ఎటాక్స్‌తో దద్దరిల్లిన అఫ్రిన్. గాలిలో కలిసిపోయిన అమాయకుల ప్రాణాలు.."
Post a Comment