-->
T20 World Cup: మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న పాకిస్తాన్‌.. ఆఫ్గనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం..

T20 World Cup: మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న పాకిస్తాన్‌.. ఆఫ్గనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం..

Pak Won The Match

T20 World Cup: టీ 20 వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్‌ విజయాల పరంపరను కొనసాగిస్తోంది. దుబాయ్‌ వేదికగా ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాక్‌ బ్యాట్స్‌మెన్‌ అద్భుత ఆటతీరును కనబరచడంతో పాక్‌ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఇంకా ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే ఆఫ్గనిస్తాన్‌ ఇచ్చిన 148 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేదించింది. పాక్‌ బ్యాట్స్‌మెన్స్‌లో బాబార్‌ అజమ్‌ 51 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో పాక్‌ను విజయ తీరాలకు చేర్చాడు. ఇక జమాన్‌ కూడా 25 బంతుల్లో 30 పరుగులు సాధించి స్కోర్‌ బోర్డు వేగాన్ని పెంచాడు. చివరిలో వచ్చిన అసిఫ్‌ అలీ కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్‌తో పాక్‌ను విజయ తీరాలకు చేర్చాడు. సిక్స్‌తో ఇన్నింగ్‌ షాట్‌ను బాది పాక్‌ను విజయాన్ని అందించాడు.

ఇక అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. మ్యాచ్‌ ప్రారంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా తర్వాత కెప్టెన్‌ మహమ్మద్ నబీ (35), గుల్బదిన్ నయిబ్ (35) ధాటిగా ఆడడంతో ఆఘ్గన్‌ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. అస్ఘర్‌ అఫ్గాన్‌ (10), రహ్మానుల్లా గుర్బాజ్‌ (10), కరీమ్‌ జనత్‌ (15) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. చివరి 3 ఓవర్లలో 43 పరుగులు రాబట్టింది ఆఫ్టన్‌ టీమ్‌. ఇక పాక్‌ బౌలర్లలో ఇమాద్‌ వసీమ్‌ రెండు, షహీన్ అఫ్రిది, హ్యారిస్‌ రవూఫ్‌, హాసన్‌ అలీ, షాదాబ్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

Also Read: AP Weather: ఏపీకి రెయిన్ అలర్ట్… ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

Anasuya Photos: మోడరన్ డ్రస్ లో ‘అనసూయ’.. న్యూ లుక్ తో అదరగొడుతున్న రంగమ్మత్త.. (ఫొటోస్)

Monal Gajjar: తనదైన అందంతో ఎట్రాక్ట్ చేస్తున్న గుజరాతి అమ్మడు ‘మోనాల్ గజ్జర్’ న్యూ ఫొటోస్…



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Bt9A4n

Related Posts

0 Response to "T20 World Cup: మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న పాకిస్తాన్‌.. ఆఫ్గనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel