-->
Shriya Saran: అభిమానులకు దిమ్మతిరిగే అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన హాట్ బ్యూటీ

Shriya Saran: అభిమానులకు దిమ్మతిరిగే అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన హాట్ బ్యూటీ

Shriya Saran

Shriya Saran: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా రాణించిన ముద్దుగుమ్మ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. పెళ్లితర్వాత సినిమాలు తగ్గించిన శ్రియ సరన్..  అడపా దడపా సినిమాల్లో మెరిసింది. ఇక సినిమాలైతే తగ్గించింది కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ చిన్నది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతోపాటు లైవ్ చాట్‌తోనూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. భర్తతో కలిసి ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంటుంది శ్రియ. తాజాగా ఈ ముద్దుగుమ్మ అతి పెద్ద సీక్రెట్‌ను బయట పెట్టి అందరిని షాక్‌కు గురిచేసింది. ఇంతకు ఆ సీక్రెట్ ఏంటంటే.. శ్రియ పండంటి బిడ్డకు జన్మనించింది. శ్రియ రష్యన్‌ క్రీడాకారుడు, బిజినెస్‌ మ్యాన్‌ ఆండ్రీ కోషీవ్‌‌ని వివాహమాడిన విషయం తెలిసిందే..

2020 సంవత్సరంలో కరోనా సమయంలో విధించిన లక్డౌన్ సమయంలో శ్రియ బిడ్డకు జన్మనించిందని తెలుస్తుంది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ బ్యూటీ. ”2020వ సంవత్సరం ప్రపంచం మొత్తాన్ని చాలా కష్టపెట్టింది. ఏడాది మొత్తం అందరూ క్వారెంటైన్‌లోనే ఉండిపోయారు. కరోనా  కారణంగా అందరూ ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. మాకొక ఏంజిల్‌ని ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను” అంటూ శ్రియ గుడ్ న్యూస్‌ను షేర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Maa Elections 2021: ‘నిన్న గెలిచిన నేను.. నేడు ఎలా ఓడిపోయానబ్బా’.. ఫలితం మారడంపై అనసూయ ఆసక్తికర ట్వీట్‌..

Nagababu: ‘మా’ రాజీనామా పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగబాబు..

Mohanbabu: నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ‘మా’ఎన్నికలపై మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3v0I4JI

Related Posts

0 Response to "Shriya Saran: అభిమానులకు దిమ్మతిరిగే అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన హాట్ బ్యూటీ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel