-->
Anubhavinchu Raja: నాగచైతన్య చేతులమీదుగా ‘అనుభవించు రాజా’ ఫస్ట్ సాంగ్..

Anubhavinchu Raja: నాగచైతన్య చేతులమీదుగా ‘అనుభవించు రాజా’ ఫస్ట్ సాంగ్..

Raj Tharun

Anubhavinchu Raja: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్,  శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. కింగ్ నాగార్జున అనుభవించు రాజా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘అనుభవించు రాజా సినిమాలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఇప్పుడే ఈ పాటను చూశాను. ఎంతో అద్భుతంగా ఉంది. భాస్కరభట్ల సాహిత్యం, గోపీ సుందర్ సంగీతం, రామ్ మిర్యాల గాత్రం ఈ పాటకు చక్కగా కుదిరాయి. ఆల్రెడీ నేను సినిమా కూడా చూశాను. సినిమా ఆసాంతం ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో రాజ్ తరుణ్ రెండు రకాల వెరియేషన్స్‌ను చూపించారు. అద్భుతమైన సందేశంతో, ఆద్యాంతం ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అనుభవించు రాజా టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

గోపీ సుందర్ అందించిన ఈ పాటలో.. జీవితాన్ని విచ్చలవిడిగా ఎంజాయ్ చేసే కుర్రాడి పాత్రను వినోదంగా చూపించారు. కోడి పందెలు, రికార్డింగ్ డ్యాన్సులు, సంక్రాంతి పండుగ వాతావరణం అంతా కూడా ఇందులో కనిపిస్తుంది. రామ్ మిర్యాల పాడిన ఈ పాటకు భాస్కర భట్ల అద్భుతైన సాహిత్యాన్ని అందించారు. విజువల్స్ ఎంతో కలర్ ఫుల్‌గా ఉన్నాయి. ఇక కొరియోగ్రఫీ కూడా ఎంతో చక్కగా కుదిరింది. సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి ఈ పాట పెర్ఫెక్ట్ ఛాయిస్.. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన కశిష్ ఖాన్ నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Maa Elections 2021: ‘నిన్న గెలిచిన నేను.. నేడు ఎలా ఓడిపోయానబ్బా’.. ఫలితం మారడంపై అనసూయ ఆసక్తికర ట్వీట్‌..

Nagababu: ‘మా’ రాజీనామా పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగబాబు..

Mohanbabu: నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ‘మా’ఎన్నికలపై మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3asw2iG

0 Response to "Anubhavinchu Raja: నాగచైతన్య చేతులమీదుగా ‘అనుభవించు రాజా’ ఫస్ట్ సాంగ్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel