-->
SBI Travel Card: ఎస్‌బిఐ అదిరిపోయే ఆఫర్.. ట్రావెల్‌ కార్డ్‌‌తో క్షణాల్లో 7 రకాల కరెన్సీలు విత్‌డ్రా..!

SBI Travel Card: ఎస్‌బిఐ అదిరిపోయే ఆఫర్.. ట్రావెల్‌ కార్డ్‌‌తో క్షణాల్లో 7 రకాల కరెన్సీలు విత్‌డ్రా..!

Sbi

SBI Travel Card: విదేశీ పర్యటనలకు వెళ్లేవారి కోసం SBI అదిరిపోయే సరికొత్తగా మల్టీ కరెన్సీ ఫారిన్‌ ట్రావెల్‌ కార్డు ప్రీపెయిడ్‌ కార్డును తీసుకొచ్చింది. డాలర్‌, పౌండ్‌, దిర్హమ్‌.. ఇలా ఏడు వేర్వేరు కరెన్సీ లావాదేవీలను ఒకే కార్డు ద్వారా చేసే.. వెసులుబాటును కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. ఆయా దేశాల్లోని ఏటీఎంలు, మర్చెంట్‌ పాయింట్స్‌ వద్ద ఈ కార్డును వినియోగించుకోవచ్చని తెలిపింది ఎస్‌బీఐ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 లక్షల ఏటీఎంల నుంచి 34.5 మిలియన్‌ మర్చెంట్ల వద్ద ఈ కార్డును ఉపయోగించొచ్చని ఎస్‌బీఐ వెల్లడించింది.

ఈ మల్టీ కరెన్సీ ఫారిన్‌ ట్రావెల్‌ కార్డుకు చిప్‌, పిన్‌ ప్రొటెక్షన్‌ ఉంటుంది. బ్యాకప్‌గా ఇంకో కార్డు కూడా ఉంటుంది. ఈ కార్డు కోసం ఎలాంటి బ్యాంక్‌ అకౌంట్‌ సమాచారం అక్కర్లేదు. ఒకవేళ కార్డు పోయినా, దొంగతనానికి గురైనా రీప్లేస్‌ చేసుకునేందుకు 24 గంటల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది ఎస్‌బీఐ. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఫారం-ఏ2 సమర్పించి ఏ ఎస్‌బీఐ శాఖలోనైనా ఈ కార్డును పొందొచ్చని.. బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ద్వారా కూడా అప్లయ్‌ చేసుకోవచ్చని అనౌన్స్‌ చేసింది. కార్డుపై ఉన్న గడువు తేదీ పూర్తయ్యే వరకు కార్డులో సొమ్మును లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

Also read:

Hyderabad: ప్రియుడితో ఏకాంతంగా బాలిక.. అది గమనించిన తల్లి వార్నింగ్.. ఆ వెంటనే ఊహించని ఘటన..!

Gold & Silver Price: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధర..

Andhra Pradesh: గుంటూరులో అర్దరాత్రి హైడ్రామా.. మాజీ మంత్రి ఇంటికి భారీగా వచ్చిన పోలీసులు.. ఆపై..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2Z4yw4M

0 Response to "SBI Travel Card: ఎస్‌బిఐ అదిరిపోయే ఆఫర్.. ట్రావెల్‌ కార్డ్‌‌తో క్షణాల్లో 7 రకాల కరెన్సీలు విత్‌డ్రా..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel