
Hyderabad: ‘అయ్యాయో వద్దమ్మా’ శరత్ ని చితక బాదారా?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..

Hyderabad: ‘అయ్యయ్యో వద్దమ్మా’ అంటూ బ్రూక్ బ్రాండ్ రెడ్ లేబుల్ టీ వారు ఇచ్చిన యాడ్‌ను తనదైన శైలిలో తీన్మార్ స్టెప్పులుగా తర్జుమా చేసి.. ఓవర్ నైట్‌లో సోషల్ మీడియా స్టార్ అయిపోయిన ‘డాన్సర్ శరత్’ అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ఏ ప్లాట్‌ఫామ్ చూసి అతని డైలాగ్సే, అతని డ్యాన్సులే, అతని మాటలే వినిపించాయి. అంతలా ఫేమస్ అయిపోయాడు. అయితే, ఈ శరత్ ఇప్పుడు మరోసారి వైరల్ అయ్యాడు. ఆ ఓవర్ నైట్ స్టార్‌డమ్.. ఇప్పుడు అతన్ని మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. అయితే, ఈసారి అతను విషాదకర, భీకర పరిస్థితులను ఎదుర్కొని వార్తల్లో నిలిచాడు. శరత్ ఒళ్లంతా గాయాలు, రక్తపు దారలతో కూడిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను బట్టి చూస్తుంటే శరత్‌ను ఎవరో కొట్టినట్లుగా అర్థమవుతోంది. శరత్‌పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆ దాడిలో అతనికి తీవ్ర గాయలయ్యాయి. గాయాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే, శరత్‌పై ట్రాన్స్‌జెండర్లు దాడి చేసినట్లు చెబుతున్నారు. ట్రాన్స్‌జెండర్లను కించపరిచాడనే భావనతోనే వారు శరత్‌పై దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉంటే.. ఇదంతా ట్రాష్ అంటున్నారు పలువురు నెటిజన్లు. ఆ ఫోటోలో ఉన్నది అసలు శరత్ కానే కాదని కరాఖండిగా తేల్చి చెబుతున్నారు. ఏదేమైనా.. ఒక్క డైలాగ్, ఒక్క స్పెప్పుతో ఫేమస్ అయిన శరత్.. ఇప్పుడిలా తీవ్ర గాయాలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. స్వయంగా శరత్ అనౌన్స్ చేస్తే గానీ వాస్తవం ఏంటనేది తెలియదు.
Also read:
Hyderabad: ప్రియుడితో ఏకాంతంగా బాలిక.. అది గమనించిన తల్లి వార్నింగ్.. ఆ వెంటనే ఊహించని ఘటన..!
Gold & Silver Price: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధర..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3pfoB7h
0 Response to "Hyderabad: ‘అయ్యాయో వద్దమ్మా’ శరత్ ని చితక బాదారా?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు.."
Post a Comment