-->
Samantha: మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారోనని కంగారు పడకండి.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..

Samantha: మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారోనని కంగారు పడకండి.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..

Samantha 1

నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం సమంతపై ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సామ్ ప్రవర్తన.. వ్యక్తిగత జీవితంపై ఇష్టానుసారంగా కథనాలు వెలడయ్యాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు సమంతకు మద్దతుగా నిలవగా.. నెటిజన్స్ మాత్రం సమంతపై ఆరోపణలు చేశారు.. సమంత అబార్షన్ చేయించుకుందని… తను ఇతరులతో క్లోజ్‍‏గా ఉంటుందని.. అందుకే సామ్ చై విడిపోయారంటూ కామెంట్స్ చేశారు. దీంతో సామ్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది… తన పై వస్తున్న రూమర్స్ అన్ని అవాస్తవం అని… ఇతరుల అనుకున్న మాదిరిగా తన జీవితం లేదని… తను తప్పు చేయలేదంటూ తెలిపింది. ప్రస్తుతం కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి తనకు సమయమివ్వాలని తెలిపింది. ఇక ఆ తర్వాత సామ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటూ వస్తోంది.

మై మమ్మా సేడ్ అనే హ్యాష్‏ట్యాగ్‏తో ప్రస్తుతం తను ఎదుర్కోంటున్న మానసిక సంఘర్షణను వెల్లడించే ప్రయత్నం చేస్తోంది. గత కొద్దిరోజులుగా సామ్ తన ఇన్‏స్టాలో పలు ఆసక్తికర పోస్ట్స్ చేస్తూ వస్తుంది. ఇటీవల తన స్నేహితురాలితో కలసి ఛార్‏ధమ్ యాత్ర చేసింది సమంత. ఇందుకు సంబంధించిన ఫోటోలో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా యాత్ర ముగించిన తర్వాత.. సామ్.. పెయింటింగ్స్ వేస్తున్న ఫోటోలను షేర్ చేసుకుంది. అలాగే తన ఇన్‏స్టాలో మరో ఆసక్తికర పోస్ట్ చేసింది.

Samantha

Samantha

” మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారోనని కంగారు పడనవసరం లేకుండా ఆమెను సమర్థంగా తీర్చిదిద్దండి. ఆమె పెళ్లి రోజు కోసం డబ్బు ఆదా చేసే బదులు, ఆమె చదువుకి ఖర్చు పెట్టండి. మరీ ముఖ్యంగా ఆమెను పెళ్లికి సిద్ధం చేసే బదులు, ఆమె కోసం ఆమెను సిద్ధం చేయండి. ఆమెకు సెఫ్స్-ప్రేమ, ఆత్మవిశ్వాసం నేర్పించండి. అలాగే ఇతరులకు అవసరం ఉన్న సమయంలో తను మార్గదర్శకంగా ఉండేలా సిద్దం చేయండి”.. అంటూ పోస్ట్ చేసింది సామ్.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Also Read: Megastar Chiranjeevi: కృష్ణవంశీ సినిమా కోసం చిరంజీవి.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్.. 

Prabhas: పూరీ జగన్నాథ్ తనయుడిపై ప్రభాస్ సీరియస్.. పిచ్చోడిలా కనిపిస్తున్నానా అంటూ..

 

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3jEPDS3

Related Posts

0 Response to "Samantha: మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారోనని కంగారు పడకండి.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel