
Sai Dharam Tej: పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్.. త్వరలోనే కొత్త సినిమా షూటింగ్‌లో..

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత వినాయక చవితి రోజు బైక్ ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా స్టోర్ వైపు వెళుతోన్న సమయంలో ఒక్కసారిగా బైక్ పై నుంచి స్కిడ్ అయిన తేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే స్థానికులు తేజ్‌ను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే అనంతరం అపోలో హాస్పిటల్‌లో సుమారు నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న తేజ్ డిశ్చార్చ్ అయ్యారు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాయాల తాలుకు నొప్పులు తగ్గేందుకు గాను ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీ చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లోనే తేజ్ తన కొత్త చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక తేజ్ ఆసుపత్రిలో ఉండగా విడుదల రిపబ్లిక్ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సుప్రీం హీరో ప్రస్తుతం.. ఓ థ్రిల్లర్ లో నటించబోతున్నారు. కొత్త దర్శకుడు కార్తిక్ దండు డైరెక్షన్ చేస్తుండగా.. సుకుమార్ స్ర్కీన్ ప్లే అందించనున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ పాల్గొంటానని తేజ్ చిత్ర యూనిట్‌కు హామీ ఇచ్చారని సమాచారం.
Unstoppable Promo: ఇచ్చిపడేసిన బాలయ్య… నటసింహం గర్జన ఓటీటీలో షురూ
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3pKRRDg
0 Response to "Sai Dharam Tej: పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్.. త్వరలోనే కొత్త సినిమా షూటింగ్‌లో.."
Post a Comment