
HPCU Recruitment: హిమచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

HPCU Recruitment: హిమచల్ ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలన్న పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 69 ఖాళీలకుగాను ప్రొఫెసర్ (19), అసోసియేట్ ప్రొఫెసర్ (33), అసిస్టెంట్ ప్రొఫెసర్ (17) ఖాళీలు ఉన్నాయి.
* యూనిమల్ సైన్స్, కెమిస్ట్రీ అండ్ కెమికల్ సైన్స్, ఎకనమిక్స్, ఇంగ్లిష్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, మ్యాథమేటిక్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, సోషల్ వర్క్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు నెట్/ స్లెట్/ సెట్ అర్హత సాధించి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను అకడమిక్ మెరిట్స్, టీచింగ్ / రిసెర్చ్ ఆప్టిట్యూడ్ సెమినార్ / లెక్చర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఓబీసీలు రూ. 400, అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులు రూ. 500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 11-11-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Pushpa: పుష్ప నుంచి మూడో సాంగ్.. గురువారం ఉదయం ‘సామీ సామీ’ పాట విడుదల..
Varudu Kaavalenu Event Live: వరుడు కావలెను ప్రీ రిలీజ్.. ముఖ్యఅతిథిగా బన్నీ..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3vUYaVU
0 Response to "HPCU Recruitment: హిమచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే.."
Post a Comment