-->
Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో రూ.50 వేలు డిపాజిట్‌ చేస్తే.. రూ.3,300 పెన్షన్‌..!

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో రూ.50 వేలు డిపాజిట్‌ చేస్తే.. రూ.3,300 పెన్షన్‌..!

Post Office

Post Office Scheme: ప్రస్తుతం పోస్టాఫీసుల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడి పొందే స్కీమ్‌లు ఎన్నో ఉన్నాయి. ప్రజలు ఆదాయం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పోస్టల్‌ శాఖలో ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. కష్టపడి సంపాదించిన సొమ్మును ఎందులోనైనా మదుపు చేయాలనుకుంటే.. పెట్టుబడిదారులు ప్రధానంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకటి సెక్యూరిటీ, రెండు రాబడి. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గుచూపుతారు. ఈ విషయంలో పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాలు వినియోగదారులకు గట్టి హామీ ఇస్తున్నాయి. ఇలాంటి వాటిలో విజయవంతమైన ఎంఐఎస్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్‌లో ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతి నెలా పెన్షన్ మాదిరిగా వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. కాలపరిమితి పూర్తయిన తర్వాత పొదుపు చేసిన మొత్తాన్ని కూడా రాబడిగా పొందవచ్చు.

ఎంఐఎస్‌ స్కీమ్‌లో వడ్డీ ఎంతంటే..

పోస్టాఫీస్ ఎంఐఎస్ స్కీమ్‌లో ప్రస్తుతం ఏడాదికి వడ్డీ 6.6 శాతం లభిస్తుంది. ఒక అకౌంట్‌లో గరిష్ఠంగా 4.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే రూ.9 లక్షల వరకు పరిమితి ఉంటుంది. ఈ ప్లాన్ కాలపరిమితి 5 సంవత్సరాలుగా ఉంది.

ఎలాంటి వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు..?

మేజర్ అయిన ప్రతి భారతీయుడు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. లబ్ధిదారులు మైనర్లు అయితే, 10 ఏళ్ల పైబడినవారై ఉండాలి. ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. పోస్టాఫీస్ ఎంఐసీ డిపాజిట్ స్కీమ్‌లో కనీసం రూ.1000తో ఖాతా తెరవవచ్చు. గరిష్ఠంగా ఖాతాలో 4.5 లక్షలు, జాయింట్ ఖాతా అయితే రూ.9 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్లో పెట్టుబడిదారులందరూ సమాన వాటాను కలిగి ఉంటారు. ఓ వ్యక్తి ప్రారంభించిన అన్ని ఎంఐఎస్ ఖాతాల్లో డిపాజిట్లు లేదా షేర్లు రూ.4.5 లక్షలకు మించకూడదు.

ఈ స్కీమ్‌లో ఎంత డిపాజిట్‌ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది..?

ఈ పథకంలో భాగంగా ఎవరైనా ఖాతాలో ఒకసారి రూ.50 వేలు డిపాజిట్ చేస్తే.. 5 సంవత్సరాల వరకు నెలకు రూ.275 లేదా ఏడాదికి రూ.3300 పొందుతారు. ఐదేళ్లలో మొత్తం వడ్డీ రూ.16,500 వస్తుంది. ఎవరైనా రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే నెలకు రూ.550, ఏడాదికి 6600 చొప్పున ఐదు సంవత్సరాల వరకు రూ. 33,000 పొందుతారు. రూ.4.5 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.2475 చొప్పున సంవత్సరానికి రూ.27,700 వస్తుంది. ఐదు సంవత్సరాలలో ఈ వడ్డీ రూ.148,500 వరకు ఉంటుంది.

మెచూరిటీ పూర్తయ్యే వరకు వడ్డీ..

ఈ స్కీమ్‌లో భాగంగా ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తరువాత వడ్డీ చెల్లిస్తారు. మెచూరిటీ పూర్తయ్యే వరకు ఈ వడ్డీ చెల్లిస్తారు. ప్రతి నెలా చెల్లించాల్సిన వడ్డీని ఖాతాదారుడు క్లెయిమ్ చేయకపోతే, ఆ మొత్తంపై అదనపు వడ్డీ లభించదు. డిపాజిటర్ ఏదైనా అదనపు డిపాజిట్ చేసినట్లయితే దాన్ని రిఫండ్ చేస్తారు. ఖాతా తెరిచినప్పటి నుంచి రిఫండ్ తేదీ వరకు పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా వడ్డీని మాత్రమే పొందుతారు. వడ్డీని ఆటో క్రెడిట్ ద్వారా అదే పోస్టాఫీస్ లేదా ఈసీఎస్‌లో ఉన్న సేవింగ్స్ ఖాతాలోకి తీసుకోవచ్చు. డిపాజిటర్ వద్ద ఉన్న వడ్డీపై పన్ను ఉంటుంది.

మూడేళ్ల ముందు ఖాతా మూసివేస్తే..

డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఏడాది గడువు ముగిసేలోపు ఎలాంటి డిపాజిట్ ఉపసంహరించుకోలేరు. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఏడాది తర్వాత, మూడేళ్ల ముందు ఖాతా మూసివేసినట్లయితే ప్రిన్సిపల్ మొత్తం నుంచి 2 శాతానికి సమానమైన తగ్గింపును మినహాయిస్తారు. మిగిలిన మొత్తాన్ని అందజేస్తారు. ఖాతా తెరిచిన తేదీ నుంచి మూడేళ్ల తర్వాత, 5 ఏళ్ల లోపు ఖాతా మూసివేసినట్లయితే.. 1 శాతానికి సమానమైన తగ్గింపును మినహాయిస్తారు. మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ స్కీమ్‌కు సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసును సందర్శించి తెలుసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

ATM Cash: ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదా? ఇక నుంచి అలాంటిదేమి ఉండదు.. ఆర్బీఐ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ 1 నుంచి అమలు

Personal Loan: అత్యవసరంగా డబ్బు కావాలా..? తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్స్ ఇస్తున్న బ్యాంకులు ఇవే



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3on8Rid

0 Response to "Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో రూ.50 వేలు డిపాజిట్‌ చేస్తే.. రూ.3,300 పెన్షన్‌..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel