-->
Brain Stroke Symptoms: నెల ముందు నుంచే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? బ్రెయిన్‌ స్ట్రోకే..!

Brain Stroke Symptoms: నెల ముందు నుంచే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? బ్రెయిన్‌ స్ట్రోకే..!

Brain Stroke Symptoms

Brain Stroke Symptoms: మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి తదితర కారణాల వల్ల మనిషి ఎన్నో రోగాల బారిన పడుతున్నాడు. ఇక మనిషికి ముఖ్యమైనది మెదడు. దీని గురించి తెలుసుకుందాం. మెదడు పనితీరు మందగిస్తే ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉంటుంది. మెదడులో కొన్ని భాగాలకు రక్తం సరఫరా ఆగిపోవడంతో స్ట్రోక్‌ వచ్చేప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్‌ కణాల్లోకి సరఫరా నిలిచిపోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉందంటున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొన్ని సార్లు ముందే పసిగడితే ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ప్రమాదం జరగడానికి కొన్ని రోజులు, గంటల ముందే కొన్ని లక్షణాలు గుర్తించినట్లయితే ఎంతో మేలంటున్నారు. వాటిపై అవగాహన ఉంటేనే సమస్యను ముందే పసిగట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బ్రెయిన్‌ స్ట్రోక్‌కు నెల ముందు వచ్చే లక్షణాలు..

బ్రెయిన్‌ స్ట్రోక్‌కు నెల ముందు వచ్చే లక్షణాలను పసిగడితే ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చు. ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం, సాధారణమైన లక్షణమే అయినా బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముందు ఇలా జరుగుతుంది. ముఖం, చేతులు, కాళ్లు ఒక వైపు మాత్రమే మొద్దుబారడం కూడా జరుగుతుంది. కంటి చూపులో తేడా వస్తుంది. కళ్లు మసకబారడం లాంటివి ఉత్పన్నమవుతాయని యూకేలో 1300 మందిపై జరిపిన సర్వేలో తేలింది. అలాగే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన చాలా మంది ఆడవాళ్లలో కనిపించిన లక్షణం తలనొప్పి. చాలా మంది తలవెనుక భాగంలోనే అలా అనిపించినట్లు ఉంటుంది. ఒక్కో సమయంలో స్పృహ కూడా కోల్పోయి పడిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.

శ్వాసలో సమస్య..

అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉందని గమనించాలంటున్నారు. వెంటనే వైద్యులను సంప్రదిస్తే ఎంతో మేలు. ఇక ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఓహియో స్టేట్ యూనివర్సిటీ వెక్సనర్ మెడికల్ సెంటర్ జరిపిన సర్వే ప్రకారం..10 శాతం మంది మహిళలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు.

మహిళల్లో స్ట్రోక్‌ వచ్చే ముందు మార్పులు..

ఈ బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముందు అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంటుంది. మహిళల్లో స్ట్రోక్‌ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చని నిపుణులు అంటున్నారు. ఉన్నట్టుండి కొన్ని విషయాలు మార్చిపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు తెలుస్తుంటాయి. అంతేకాకుండా వికారం, వాంతులు, మెదడులో కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా వాంతులు, వికారంగా ఉండటం వంటివి కనిపిస్తాయి. ఇక చూపులో సమస్యతో పాటు భ్రమ పడుతున్నట్లు కూడా అనిపిస్తుంటుందట.

అధిక రక్త పోటు:

ఈ స్ట్రోక్‌ వచ్చే ముందు అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల మెదడులో రక్త గడ్డ కట్టే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తు గర్భస్రావాలు జరుగుతుంటాయి. అది స్ట్రోక్ రిస్క్ ను పెరిగేలా చేస్తుందని అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ వెల్లడిస్తోంది. అడ్రినల్ గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే డీహెచ్ఈఏ హార్మోన్ వెంటనే తగ్గిపోతుంది. దాని వల్ల ఈస్ట్రోజన్లు, ఆండ్రోజన్స్ తగ్గిపోతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఎక్కువగా టెన్షన్‌కు గురి కాకుండా ఉండాలని చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

 ఈ అలవాట్లకు దూరంగా ఉంటే గుండె ప‌దిలం.. నేడు ప్రపంచ హృదయ దినోత్సవం

Health Benefits: పెరుగు, దానిమ్మ, పాలకుర, నిమ్మ, బిట్‌రూట్ ప్రతి రోజూ తిన్నారంటే..!

Diabetes : డయాబెటిస్‌ ఉన్నవారు ఈ పండ్లను తినవచ్చా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3l1G4O8

Related Posts

0 Response to "Brain Stroke Symptoms: నెల ముందు నుంచే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? బ్రెయిన్‌ స్ట్రోకే..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel