
Navratri 2021: నవరాత్రుల్లో ఉపవాసం చేస్తూ బరువు తగ్గాలనుకుంటున్నారా..! అయితే ఈ 4 విషయాలు తెలుసుకోండి..

Navratri 2021: ఉపవాసం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. వారంలో ఒకరోజు ఉపవాసం పాటిస్తే శరీరం తనను తాను డిటాక్సిఫై చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి నవరాత్రులు సువర్ణకాశం. ఎందుకంటే తొమ్మిది రోజులు ఉపవాసం చేయడం ద్వారా అదనపు కేలరీల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. చాలామంది ఉపవాసం ఉన్నప్పుడు ఆహారాన్ని తినరు కానీ ఇతర చిరుతిళ్ల కోసం వెతుకుతారు. అవి బరువు తగ్గించడానికి బదులు పెంచుతాయి. అయితే నవరాత్రులలో ఉపవాసం ఉండే వ్యక్తులు ఏం చేయాలో తెలుసుకుందాం.
1. పండ్లు, కూరగాయలను విస్మరించవద్దు
ఉపవాస సమయంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి శరీరానికి శక్తినిచ్చే అన్ని పోషకాలను కలిగి ఉంటాయి. అలాగే బరువు పెరగనివ్వవు. కానీ ప్రజలు ప్రసాదాల పేరుతో స్వీట్లు, తియ్యటి పదార్థాలు, చక్కెర ఉండే ఆహారాలు ఎక్కువగా తింటారు. అవి ఖచ్చితంగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి అంతేకాదు శరీరానికి ఎక్కువ కేలరీలను అందిస్తాయి. దీంతో బరువు పెరుగుతారు.
2. నెయ్యి, నూనె అధిక వినియోగం
ఉపవాస సమయంలో అన్నం, రొట్టెకి బదులుగా చాలామంది వేరే వంటకాలను చేస్తారు. ఇందులో నెయ్యి,నూనె అధికంగా వినియోగిస్తారు. దీంతో బరువు తగ్గడానికి బదులు పెరుగుతారు.
3. నీరు విషయంలో పొరపాటు వద్దు
4. బయట ఆహారం తినవద్దు
ఉపవాస ఆహారాలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. బంగాళాదుంప చిప్స్, మఖానా, పాపడ్ మొదలైన అన్ని వస్తువులు అమ్ముతున్నారు. ఇవి తింటే విపరీతంగా బరువు పెరుగుతారు. కాబట్టి వీటిని తినవద్దు. ప్యాక్ చేసిన ఆహారానికి బదులుగా ఇంట్లో తయారుచేసిన వాటిని తినడమే మేలు.
Fish: మటన్, చికెన్ కంటే చేపలు బెస్ట్..! ఎందుకో తెలుసుకోండి..
క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను తగ్గించే ఫుడ్.. రోజూ తీసుకుంటే అనారోగ్య సమస్యలను అస్సలు ఉండవు..
Baca Juga
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ahY5kT
0 Response to "Navratri 2021: నవరాత్రుల్లో ఉపవాసం చేస్తూ బరువు తగ్గాలనుకుంటున్నారా..! అయితే ఈ 4 విషయాలు తెలుసుకోండి.."
Post a Comment