
Maa Elections 2021: మా ఎన్నికలపై బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు.. ఆపండి ఈ నల్లా దగ్గర లొల్లి అంటూ..

Maa Elections 2021: మా ఎన్నికల దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇప్పటికే ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు ప్రకాష్ రాజ్- మంచు విష్ణు. మా ఎలక్షన్స్…టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. మేనిఫెస్టోలు-హామీలు..ఒకటేమిటీ..? జనరల్ ఎలక్షన్స్ మించి సభ్యుల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. మా ఎన్నికల్లో ఎప్పుడైతే ప్రకాశ్ రాజ్ నిలబడుతున్నానని ప్రకటించారో అప్పటి నుంచే.. ‘మా పోరు’ ఓ థ్రిల్లర్ చిత్రాన్ని తలపిస్తూ.. రసవత్తరంగా సాగుతోంది. అభ్యర్థులు.. ప్రత్యర్థులు.. ప్లాన్లు, పార్టీలు.. ఆడియో రికార్డుల లీకులు.. ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో ఫైటింగ్‌లు ఇలా.. రకరకాలుగా సాగుతూ..రాజకీయాలనే తలదన్నుతోంది. ఎలక్షన్ డేట్ అక్టోబర్ 10 దగ్గరకు రావడంతో.. అభ్యర్థులు ఈ తరహా ప్రచారాలకే ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తూ… ‘మా’ మెంబర్స్ ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఇక మా ఎన్నికల పై రకరకాలుగా స్పందిస్తున్నారు కొందరు. ఈ ఎన్నికలపై బాబు గోగినేని తనదైన శైలిలో స్పందించారు.
వీళ్ళకి నేను అప్పుడే కొన్ని అక్షంతలు వేసాను.. అంతా బడాయి మాటలు, బెదిరింపులు. మా డాడీ, మా మమ్మీ, మా అంకుల్ మా కుటుంబం అనే సిన్సియారిటీ లేని కబుర్లు. ఇప్పుడు ఓటుకు నోటు అన్న వార్తలు. ఎలక్షన్ ప్రాసెస్ ను బ్రష్టు పట్టిచ్చడం.. “నువ్వు మగాడివైతే” అని హుంకరించి, మళ్లీ అప్పుడే “నీకు డీసెంన్సీ డెకోరం ఉందా?” అని అడగటం, మా కుటుంబం మమ్మల్ని ఇలా పద్ధతిగా పెంచింది అని మురిసిపోవడం… కాదూ, మీ ప్యానెల్ లో ఆడవాళ్లు ఏమంటున్నారు?.. మీరు ఇలా నీచంగా మాట్లాడుతూ ఉంటే?.. ఇండస్ట్రీ పెద్దలంట! హీరోయిన్లను కొట్టినోళ్లు పెద్దలా?.. Me Too ఉద్యమం జరుగుతున్నప్పుడు గమ్మున కూర్చున్న వాళ్ళు, నక్కి నక్కి దాక్కున్న వాళ్ళు పెద్దలా?.. డూప్‌లను పెట్టుకుని ఫైట్స్ చేసి వీళ్లు హీరోలా? తెలుస్తానే వుంది నిజ జీవితం లో ఏమిటి అని.అంటూ సెటైర్లు వేశారు బాబు గోగినేని.
అలాగే వేరే రాష్ట్రాల నుండి తెల్ల తోలు హీరోయిన్లను తెచ్చుకున్నవారే అడగాలి మా కు అధ్యక్షుడిగా లోకల్‌గా ఎవరూ దొరకలేదా అని..? అని ప్రశ్నించారు. ఇదెట్లా కుటుంబం? ఎవడన్నా కుటుంబాన్ని సొసైటీ రెజిస్టర్ చేస్తాడా? ఎలెక్షన్లు కుటుంబాల మధ్య కాదు.. ఆపండి ఈ నల్లా దగ్గర లొల్లి అంటూ మండిపడ్డారు బాబు గోగినేని..
మరిన్ని ఇక్కడ చదవండి :
Bigg Boss 5 Telugu: సన్నీకి హ్యాండ్ ఇచ్చిన లోబో.. రాజుగా యాంకర్ రవి.. కన్నీళ్లు పెట్టుకున్న హమీద..
Kavya Thapar: క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో కవ్విస్తున్న కావ్య.. ‘ఏక్ మినీ కథ’ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్..
Big News Big Debate: ‘మా’..యుద్ధంలో పెద్దలు ఎటు?.. కీలక విషయాలు వెల్లడించిన మురళి మోహన్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lkijAJ
0 Response to "Maa Elections 2021: మా ఎన్నికలపై బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు.. ఆపండి ఈ నల్లా దగ్గర లొల్లి అంటూ.."
Post a Comment