
NARL Recruitment: చిత్తూరులోని నేషనల్ అట్మాస్పియర్ రీసెర్చ్ లాబొరేటరీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

NARL Recruitment 2021: చిత్తూరులోని నేషనల్ అట్మాస్పియర్ రీసెర్చ్ లాబోరేటరీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఈ సంస్థలో మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 14 ఖాళీలకుగాను సైంటిస్ట్/ ఇంజనీర్ (01), జూనియర్ రిసెర్చ్ ఫెలో (13) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* సైంటిస్ట్/ ఇంజనీరింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్/ టెక్నాలజీ విభాగాల్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
* జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు అప్లై చేసుకునే వారు ఇంజనీరింగ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్/ గేట్/ జామ్/ జెస్ట్ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* సైంటిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు చెల్లిస్తారు.
* జూనియర్ రిసెర్చ్ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 31,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 29-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Puneeth Rajkumar Daughter: ‘డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా’.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె
Kameng River: కమెంగ్ నదిలో విషం చిమ్మిన చైనా.. వేల సంఖ్యలో చేపల మృత్యువాత
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Bzot50
0 Response to "NARL Recruitment: చిత్తూరులోని నేషనల్ అట్మాస్పియర్ రీసెర్చ్ లాబొరేటరీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే.."
Post a Comment