
Health: మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారా.? ఈ జ్యూస్‌లను తాగండి ఫలితం మీకే కనిపిస్తుంది..

Health: మలబద్దకం చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఇది ప్రధానమైంది. మారుతోన్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా ఇటీవల ఈ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది. మలబద్దకం అంత సింపుల్‌గా తీసుకునే సమస్య కాదు. ఇది దీర్ఘకాలంలో హెమరాయిడ్స్, ఫిషర్స్, పైల్స్ వంటి అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. అంతేకాకుండా శరీరంలో కూడా మలబద్దకం ఇతర సమస్యలకు కారణంగా మారుతుంది.
అయితే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మలబద్దకానికి చెక్ పెట్టవచ్చని మనకు తెలిసిందే. అలా కాకుండా కొన్ని రకాల జ్యూస్‌లను తీసుకున్నా మలబద్దక సమస్యకు చెక్‌పెట్టవచ్చని మీకు తెలుసా? మలబద్దకాన్ని తగ్గించే కొన్ని జ్యూస్‌లు ఇప్పుడు చూద్దాం..
* మలబద్దకాన్ని తగ్గించడంలో యాపిల్ జ్యూస్ బాగా పనిచేస్తుంది. దీనిని పండు రూపంలో కాకుండా జ్యూస్‌గా తీసుకుంటే ఇంకా ఫలితం త్వరగా లభిస్తుంది. యాపిల్‌లో ఉండే ఫైబర్, మినరల్స్, విటమిన్లు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. యాపిల్ జ్యూస్‌లో కొద్దిగా సోంపు గింజల పొడిని కలుపుకుని తాగితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది.
* నిమ్మరసం కూడా మలబద్దకానికి మంచి విరుగుడుగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె, జీలకర్రను కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం ద్వారా మలబద్దకం సమస్య నుంచి బయటపడొచ్చు.
* పైనాపిల్ కూడా జీర్ణ వ్యవస్థను మెరుగపరుస్తుంది. ఇందులో ఉండే బ్రొమెయిలిన్ అనే ఎంజైమ్.. సుఖ విరేచనం కావడానికి ఉపయోగపడుతుంది. పేగుల్లో ఉండే మలాన్ని పైనాపిల్ జ్యూస్ బయటకు పోయేలా చేస్తుంది.
* నారింజ జ్యూస్ కూడా మలబద్దకాన్ని తరిమి కొడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఫైబర్ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.
* ద్రాక్షలో కూడా ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మలబద్దకంతో సతమతమయ్యే వారు రోజూ ద్రాక్ష పండ్ల జ్యూస్‌ను తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.
Also Read: Huzurabad By Election: పోటెత్తిన హుజురాబాద్ ఓటరు దేవుళ్లు.. ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..
Puneeth Rajkumar: ‘మనుష్యులందు నీ కథ… మహర్షిలాగ సాగదా’.. కంఠీరవ కిక్కిరిసింది ఇందుకే
Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైరు పేలి లారీని ఢీకొన్న కారు.. నలుగురు మృతి
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EsSSUz
0 Response to "Health: మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారా.? ఈ జ్యూస్‌లను తాగండి ఫలితం మీకే కనిపిస్తుంది.."
Post a Comment